బాస ఇల్వ! : - గంగరాజుపద్మజ

 బాస ఇల్వ తెల్సుకో,బాసంటే మణిపూస,
ఇల్వతెల్సుకు నేరిస్తే మేలేకదా?
రాందాస బాసతోనే జయగోసలేకుంటే 
ఆగోసబాస తెలీకుంటే
మనిసి బతుకంత అమవస
పరమాత్ముడు పుట్టించిన పసువుకన్న పిట్ట కన్న
మనిసే గొప్ప ,
బాస యాస పుట్టె మడిసితోనే
మనిసి బతుకు బాస తోనే
బాస తెల్వకుంటె బతుకు రసాబాస
బాస లెన్నున్నా మనతల్లిబాస
తెలుగుబాస 
అమ్మ బాసని ఇడవకు పరబాసపై ఆశ మోజుతో
తెలుగుబాస లెస్సన్నడు రాజు
తెల్గుఇడ్సి ఇంగిలీసుపై ఎందుకుమోజు? 
తేనె బాస తెలుగు,రత్నాల పాట
తెలంగానబాస 
కోటి రతనాల వీణె తెలంగానబాస 🌹
కామెంట్‌లు