గోవా! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 దీని రాజధాని పనాజీ.కొంకణి మరాఠీ ముఖ్య భాషలు.రాష్ట్ర పక్షి  మృగము బ్లాక్ క్రెస్టెడ్ బుల్బుల్,ఇండియన్ బైసన్.క్రీ.పూ.3వశతాబ్దిలో మౌర్య సామ్రాజ్యంలో ఉంది.ఎందరో రాజులు పాలించారు.14వశతాబ్దిలో వ్యాపార కేంద్రంగామారింది. మిడిల్ ఈస్ట్ తో గుర్రాల వ్యాపారం జరిగింది.ఇక 1510లో పోర్చుగీసువారు తిష్ఠవేశారు. సుగంధ ద్రవ్య వ్యాపారంతో గోవా ఉన్నతశిఖరాలు అందుకుంది.1961దాకా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్న గోవాని 1961 లో ఇండియన్ ఆర్మీ స్వాధీనపర్చుకుంది. కేవలం రెండురోజుల్లో గోవా యూనియన్ టెర్రిటరీ గా కల్సింది.1987లో గోవా రాష్ట్రం ఏర్పడింది.ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్ లతో టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చెందింది.మాండోవి,జుఆరి ముఖ్య నదులు.మార్మొగోవా అద్భుత ఓడరేవు.పోర్చుగీస్ వాస్తు కళ అలరిస్తుంది🌹
కామెంట్‌లు