ఉత్తరాఖండ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాజధాని.హిందీ గర్వాలీ, కుమోనీ ముఖ్య భాషలు.రాష్ట్ర పక్షి హిమాలయన్ మొనాల్.జంతువు హిమాలయన్ మస్క్ డీర్, రాష్ట్ర పుష్పం బ్రహ్మ కమలం.గర్వాల్ మౌర్య సామ్రాజ్యంలోది.15వశతాబ్దిలో అజయ్పాల్ అనేరాజు 52చిన్నచిన్న సంస్థానాల్ని కల్పి కొత్త రాజ్యం గర్వాల్ ని ఏర్పాటుచేసిన తర్వాత 300ఏళ్లు బాగా వర్ధిల్లింది. 7_11శతాబ్దుల మధ్య కాలంలోకత్యూరి వంశంవారు కుమాన్ ని పాలించారు.1791లో గూర్ఖాలు కుమాన్ గర్వాల్ ని తమస్వంతం చేసికలిపేశారు.19వ శతాబ్దిలో బ్రిటిష్ పెత్తనంలోకి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ లో ఉన్న  ఈప్రాంతం 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రంగా వెలుగులోకి వచ్చింది.
500రకాలపూలజాతుల అందంకి నిలయం చమోలీ జిల్లా.గంగ యమున కి పుట్టిల్లు.నందాదేవి నేషనల్ పార్క్ ని యునెస్కో గుర్తించింది.గంగోత్రి యమునోత్రి బదరీనాథ్ కేదారనాధ్ పవిత్ర క్షేత్రాలు. నైనిటాల్, ముస్సోరి,డెహ్రాడూన్ అందానికి ట్రెక్కింగ్ కి,మంచు ఆటలకి ప్రసిద్ధి.విదేశాలని తలదన్నే ప్రకృతి మంచుకొండలు మన ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. ఇవి చూస్తే చాలు🌹
కామెంట్‌లు