కడు పేదరికం ఉన్నా
సరస్వతీమాత కృప ఉంటే
అందనత్త ఎత్తుకు ఎదగవచ్చన్నదానికి ప్రతీకయే
మన మధురగాయకులు
ఘంటసాల.
ఏడుకొండలవాడ వేంకటేశాయని
ఆపదమొక్కుల వానినిప్రార్ధించినా
ముక్కోటి దేవతలు ఒక్కటైనారని ఆలపించినా
ఈ జీవన తరంగాలలో ఆదేవుని సన్నిధిలో
ఎవరికి ఎవరు సొంతం ఎంతవరకీ బంధమని జీవిత పరమార్థం చెప్పినా
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యమన్నా
నీలిమేఘాలలో గాలి కెరటాలలోయని
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృస్టికే అందాలు తెచ్చినారని
ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులోయని
ఎన్నో ఎన్నెన్నో మధురమైన సినీ పాటలు పాడి
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పుష్పవిలాపానికి
తన గాత్రంతో ఆర్ద్రతతో గానం చేసి
జీవిత చరమాంకంలో
వసుదైకానికే ఆదర్శమైన
"భగవద్గీత" ను తన సుస్వర గాత్రంతో సామాన్య ప్రజలకందించి
అత్యున్నత పద్మశ్రీ పురస్కారానికే వన్నె తెచ్చిన
అమరగాయకులు ఘంటసాల గారికి
నే సమర్పిస్తున్న అక్షారాంజలులు...!!
........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి