సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -69; - అమ్మ కడ్పు జూస్తుంది-ఆలి కీస జూస్తుంది/

తల్లి కడుపు చూస్తుంది- పెళ్ళాం జేబు చూస్తుంది
*****
"గిదేందవ్వా! గింతకన్న అన్నాలపు మాటింకోటి ఉందా? మాటిమాటికీ నన్ను వద్దిత్తున్నది. కొడ్కుని ఎనకేసుకొత్తుంది.  అద్దు జెప్పాలన్న గ్యానం లేదు. తన లెక్క నేను గాదా ఏంది?"  ముక్కు జిర్రున జీదుకుంట, కండ్లల్ల దూకుతున్న నీళ్ళని పైట శెంగుతో  దుడ్సుకుంట సొద జెప్తున్న అలివేలును ఊకించుతూ...
గింతకి ఏమైందో శెప్పు కోడలా? ఎవలేమన్నరు?ఎందుకిట్ల రంధి జేత్తున్నవ్ అనంగనే...
"అవ్వా! అందరత్తలు నీ లెక్కుంటె గిస్మంటి పంచాయితులు షడాయితులు అసలొత్తయా?  మా ఆయ్న ఎస్మంటోడో నీకు సుత దెల్సుకదవ్వా!బల్లె బెల్లుగొట్టుడు,తల్పులు దీసుడు,ఏసుడు ఉజ్జోగం ఎల్గబెడుతుండు. గదేనవ్వా !అటెండ్రుగ జేత్తుండు.నెలకోపాలి వొచ్చే జీతమెన్నడన్న ఇంట్లెకు దెచ్చిండా? ఏడ తగల బెడ్తుండో తెల్వదు.పొల్లగాండ్లు పెద్దైతున్నరు? గాళ్ళ పై సద్వులకి ఎన్నెన్ని పైసలు గావాలె? గివ్వన్ని మా యత్త జెప్పాలె. గజ్జెప్పుడొదిలి నన్ను ఆడిపోసుకునుడేంది?నేను ఆయిణ్ణి అయిందాన్కి కాందాన్కి ఆయిణ్ణి కాల్సుకు తింటున్నంట.తిండీ తిప్పలు మాటొదిలి పైసల ముచ్చటి అడ్గుడు, కీసలెత్కుడు జేత్తున్ననంట. గిట్ల ఎన్నెన్ని మాటలందవ్వా? నన్నో గడ్డిపోస లెక్క తీసిపడేత్తుంటె మస్తు దుక్కమొత్తుంది.ఇంట్లె ఉండబుద్ది గాక నీ తానకొచ్చిన.గట్ల శెప్పుకుంట శెప్పుకుంట ఏడుత్తున్న అలివేలును జూత్తుంటె అవ్వకి సుత బాదన్పించింది.
 ఇంకేమంటదో తెల్సా అవ్వా? ఏ దినాము మొగుడికి కడ్పునిండ తిండి బెట్టుడు ఎర్గనంట. గట్ల నేను పెట్టందాన్నైతె గాయన దుండుకు దుండు ఎట్లయిండు? సేశినవన్ని ఎన్కోళ్ళకి ఉన్నవా లేవాని  సుత సూస్కోకుండ సుష్టుగ తినుడు.గట్ల దినే బొర్ర బెంచిండు. గిదంత తెల్సి సుత మా యత్త గిట్లనుడేమన్న మంచిగుందా? నువ్వే జెప్పవ్వా?
గట్లంటే ఎవ్వలికైన బాదగనే ఉంటదిలే అలివేలూ! అందునా  "అమ్మ కడ్పు జూస్తది - ఆలి కీస సూస్తది" అన్న  సామెత ఎన్కటి సంది పెజలందరి నోళ్ళల్ల బాగా నానింది గద!గదాన్ని అడ్డం బెట్టుకుని మీ అత్త నిన్ను సాదిత్తున్నది గంతే!
నూటిక్కోటికి ఎవలో ఒకలిద్దరు పైసల కోసం మొగుడ్ని శికాకు జేసేటోళ్ళు ఉండేటోళ్ళు. గాళ్ళగాట గట్టి మీ అత్త నిన్ను గట్లనడం అస్సలు బాగలేదు.నువ్వెస్మంటి దానివో మనూల్లె అందర్కి మీ ఆయ్నకి సుత తెల్సు. గీ యిసయంల నిన్నెప్పుడన్న అన్నడా?
"ఎప్పుడన్లే అవ్వా!"
 ఇంగెందుకు రంది జేత్తవ్? సైమం జూస్కొని మీ అత్తతో నే మాట్లాడ్తగని. గియ్యన్ని తల్సుకొని మన్సు పాడుజేస్కోకు!"అని నీళ్ళతో కండ్లుదుడిసి గుక్కెడు శాయ నీళ్ళిచ్చి మల్లొక్కపాలి దైర్నం జెప్పి పంపింది అవ్వ"
గదండీ సంగతి? ఎన్కటోళ్ళు "అమ్మ కడ్పు జూస్తది- ఆలి  కీస సూస్తది"అంటే... ఎన్కట ఉమ్మడిగ బత్కెటోళ్ళు తల్లే 'ఇంట్లె అందరు తిన్నరా లేదాని' సూస్కొనేది.కోడండ్లు  పన్లు జేసుడుతోనే తీర్కె లేకుండ ఉండేటోళ్ళు.
కామెంట్‌లు