ప్రతి రోజూ... నాకోసం
ఎదురు చూసె నాబావ ఈ రోజిట లేడేలనో....!
కాన రాడేలనో...!!
ఏ మాయె నా బావ కేమా యెనో...!!
ఈ మంచి నీటి బాయికినే నొచ్చు ఏలకే...
మెరిసేటి కళ్లతో...
సిరి నవ్వు మూతితో చా టంత మొకముతో...ఎదు రొచ్చే నాబావ...!
ఆ తీపి తీపి కబుర్లతో మై మరిసి పోయి నే ను...
మా ఇద్దరి నీడను ఈ మంచి నీటి సెరువులో చూసు కోని మురిసి పోతు
ఏల మరిసి పోయి నపుడు...
ఎగతాలిగ నువ్వునన్ను ఎక సెక్కాలాడి నపుడు
నా ఏడుపు సూసి నువ్వు
బుజ్జ గించినది తలుసుకు
నాను మురిసి పోతాను !
నువ్ రానేక పొతే ...
రానేనని సెప్పలేవ...
ఎంత సేపు నా నిలాగ
ఎదురు సూ సే ది బావా...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి