మన పినపాక శ్రీరామాలయ ప్రధాన ధర్మకర్త శ్రీ ఎర్రాప్రగడ రామమూర్తి గారు రచించిన 'చేయూత' అష్టాక్షరీ శతకం పుస్తకాన్ని, ఆడియో రికార్డును ఈరోజు సోమవారం భద్రాద్రి రాముడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించడం అయినది. ఈ పద్యాలను హైదరాబాదుకు చెందిన మా సోదరి, ప్రముఖ కర్ణాటక సంగీత గాయని శ్రీమతి పలివెల భారతి తన జీవిత భాగస్వామి శ్రీ వాజపేయాజుల మణి కిషోర్ తో కలిసి స్వరపరిచి ఆడియో రికార్డు చేశారు. ఈ శతకంలోని 108 ను పద్యాలను శ్రీమతి భారతి ఆలపించారు. ఈ ఆడియో రికార్డును భద్రాద్రి రామాలయ మైకుల ద్వారా పురవీధుల్లో ప్రసారం చేస్తున్నారు. సంబంధిత ఆడియోతో పాటు ఈరోజు జరిగిన పుస్తక, ఆడియో ఆవిష్కరణ ఫోటోలు, వీడియోలు మనందరి కోసం...
ఎర్రాప్రగడ రామమూర్తి 'చేయూత' అష్టాక్షరీ శతకం ఆవిష్కరణ
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి