కొత్త సంవత్సరానికి స్వాగతం:- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-విశాఖ పట్నం
డెబ్బది సంవత్సరాల జీవితంలో
తీపి జ్ఞాపకాలు మరువలేని సంఘటనలు
సంవత్సరాంతంలో నాకు తోడు నీడగా 
ఏభై ఏండ్లయి ఉన్న ధర్మపత్నితో చెబుతు
ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటు
ఈ సంవత్సరం సంఘటన 
పహల్గాం దుర్ఘటనలో  ముష్కరుల దాడిలో  స్నేహితుని మరణం
శాస్త్రవేత్తగా పని చేసిన నేను రోదసీ యానాం చేసి 
భారతావని  జాతీయ పతాకం ఎగురవేసి కీర్తి ప్రతిష్టలు
 ఇనుమడింప చేసిన శుభా0శు శుక్లాని చూసి ఆనందించన వేళ.

ఆపరేషన్ సిందూర్, నూట ఏబది ఏండ్ల వందేమాతరం లో ప్రజల ఏకదాటిగా దేశభక్తి చాటడం

క్రికెట్ లో పురుషుల  ఐ.సి ఐ సి ఐ చాంపియన్ విజేత
మొదటిసారి  ప్రపంచ క్రికెట్ లో మహిళలు విజేతలవడం
అయోధ్యలో  సనాతన ధర్మానికి ప్రతీకగా కాషాయ ధ్వజ  ఎగురవేయడం.

ప్రపంచ ప్రసిద్ధ కుంభమేళా విజయవంతం
దేశరక్షణ  సనాతన ధర్మమే వసుదైకానికే ఆదర్శమని ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు 
రాబోయే సంవత్సరం మరెన్నో విజయాలతో ముందుకెళ్ళాలని
'లోకా సమస్తా సుఖినో భవంతు' అన్న   సనాతనధర్మానికి ప్రతీకగా అనుభూతులు ఆనందమయం కావాలని
భగవంతుని ప్రార్ధిస్తున్నా..!


కామెంట్‌లు