బామ్మోపదేశం.:-డా.సి వసుంధర,చెన్నై.
 నేటి మగపిల్లలు ఆనాటి మీ నాన్నలుకారు,
మీ కోసం తల్లిదండ్రులకు కూడా
దూరమౌతున్నారు.
ఇద్దరి మధ్యన
నలిగిపోతున్నారు
మీ ఇంట్లో అన్నదమ్ములుంటే
ఆదిమికు తెలుసును.
ఐనాగాని 
ఎవరి ఇది వారిదే
అన్నట్లు ఉంటుంది
మనిషి వ్యవహారం.
 
చిన్నపిల్లలు మీరు
చూడండి అమ్మలు
చక్కగా ఊహించి,
ఊహల్లొ తేలక,
కాపురములను, 
మీ కాలి నూపుర ధ్వనులతో కాంతి వంతముచేసి కళ్యాణ
కాంతులను నిత్య కళ్యాణముగా నిలుపుడి. లోక కళ్యాణ
మార్గమునకు
మార్గదర్సకులుకండి.
నాసృష్టికి, దృష్టికి హాని కలిగించకండి. నేను 
గీతాదులలో
లలో చెప్పిన
హైందవ ధర్మానికి
హానికలిగించి
ఎన్ని పూజలు చేసినా
 ఎన్ని టెంకాయలు కొట్టినా,ఎన్నికోట్లు
హుండీలో వేసినా .మికొర్కలు
తీరవచ్చేమోగాని
నా దీవేనలందవు.
నావేదనంతా మీకోసమే.
సంసారమంటే సారవంతమైనది.
ఉండవలసినవారు
ఒకచోట కూడితే
సంసారం. లేకపోతే నిస్సారం           /చిన్నదైన జీవితాన్ని
చిన్నాభిన్నం చేసుకోకండి.ఐనవారితో పిల్ల పాపలతో
ఆ ఇంటికీ  ఈ ఇంటికి
మధ్య మమకారం పెంచుతూ,
అర్ధవంతమైన అర్ధాంగి లా,అందరిని ఆదరించే అమ్మలా  మీరు మనగలిగితే నేను వినగలిగితే ఆనాడే
ఈ తిరుపతి వెంకన్నకు
ఆనందం.హైందవ జాతికి హృదయానందం.
అమ్మానాన్నలకు
మహదానందం.
అప్పుడే భక్తా!నాచింత
కించత్ కూడా ఉండదు.             
అప్పటిదాకా
నా అశాంతి తొలగదు."
వెంకన్న కంటి కన్నీటి వెచ్చదనానికి ఉలిక్కిపడి లేచాను.జరిగింది మికు వివరించాను.ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారో ఒంట 
బట్టించుకొంటారో
మీ ఇష్టం.మీ బాగుకోరే
బామ్మ, బొమ్మకాదు .
ఇలానే కప్పుల తక్కెడలా కాపురాలు కొనసాగ కూడదని నా ఆశ.స్వామి సందేశం మీ కందించాను.  శాంతం,సర్దబాటు,
ఓర్పు ఇవి బలహీనతలు కావని,మిమ్మల్ని బలవంతులునిగా చేసే  భగవత్  స్వరూపాలుగా గుర్తించండి.
పురాణ స్త్రీల అంతరంగ ఆవిష్కరణల అంతరార్ధం అదే సుమండీ.ఉంటానండి.
,
సి వసుంధర.

కామెంట్‌లు