తెలుసుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

చరిత్ర అంటే రాజులు రాజ్యాలేకాదు వర్తక వ్యాపారులు మూలస్థంభాలు అని తెలుసుకోవాలి .జానపద లోకసాహిత్యంలో వ్యాపారులగూర్చి ఎంతో సమాచారం ఉంది.అగ్రవాల్ కులంవారు వ్యాపార దక్షత కలవారు.అగ్రసేన మహారాజు కేవలం వ్యాపారుల కోసం ఓనగరం కట్టించాడు.భిన్న విభిన్న ప్రాంతాల్లో వర్తకుల్ని రప్పించి అక్కడ ఉండే ఏర్పాటుచేశాడు.నగరంలో ప్రతి కుటుంబం కొత్త గా వచ్చిన వ్యాపారికి ఒక ఇటుక  ఒక బంగారునాణెం ఇచ్చితీరాలని నియమంపెట్టాడు రాజు.అలా కొత్తగా వచ్చిన వారు వాటితో ఇల్లుకట్టుకుని దుకాణం తెరిచేవారు. అలా అగ్ర సేన మహారాజు చేయూత తో ప్రపంచం నలుమూలల నించివర్తకులు రావటం జరిగింది.
కేరళ లోకసాహిత్యంలో ఉప్పుకొట్టన్ అనే వర్తకుని గూర్చి ఉంది.అతను యూదు లేక ముస్లిం వ్యాపారి .ఉప్పు అమ్మేవారికి ఉప్పు,పత్తివ్యాపారులకు పత్తి..ఇలా ఠక్కున అందజేసేవాడట!పరాయీపెట్టాపంథిరుకులమ్ అనే కథాసంగ్రహంలో బ్రాహ్మణ తండ్రి దళిత తల్లికి 12మంది సంతానం.ఈపిల్లల పెంపకం మంచిచెడ్డలు విభిన్న కులాల వారు చూసేవారు.మరి ఉన్నతకులంవారి ఔన్నత్యం ఎప్పుడూ ఒకేలా ఉంది.బౌద్ధ జాతకకథల్లో గూడా వ్యాపారుల కథలున్నాయి.అపణ్ణజాతక్,లో ఓచతురవ్యాపారి కథ ఉంది.ఎడారిలో ప్రయాణంకి కావల్సిన నీరు మోసుకుపోయాడు. ఛాలెంజ్ చేసి ఎడారి పయనం చేశాడతను. వనుపథ్యజాతక్  అనే కథలో ఎన్నో కష్టనష్టాలున్నా కూడా వ్యాపారి నీటిని వెతికి చేజిక్కించుకుంటాడు. సెరివాణిజ్యజాతకం లో  అనైతికవ్యాపారులవర్ణన ఉంది.వస్తువుల ధరలు పెంచి కల్తీ అమ్మేవారిగూర్చి,అన్యాయ అక్రమార్కుల ఉల్లేఖనం ఉంది.తాందులనిల్జాతక్ లోవస్తువుల డిమాండ్ ధరలగూర్చిన ప్రస్తావన చేయబడింది.తమిళంలో రచింపబడిన బౌద్ధ మహాకావ్యాల్లో రాజుల కి వ్యాపారులంటే అసూయ ఉండేదిట!! రాణుల కాలి అందియలకి ముత్యాలు,వ్యాపారుల భార్యల కాలి పట్టాలకి వజ్ర వైడూర్యాలుండేవి.బైబిల్ లో కూడావ్యాపారుల కథలున్నాయి.న్యూటెస్టామెంట్ లో"పేరబుల్  ఆఫ్ టాలెంట్స్" లో కథ ఇది.ఓవ్యక్తి తన ముగ్గురు దాసులకు కొంత డబ్బుఇస్తాడు.ఇద్దరు దానితో లాభం గడిస్తే సంతోషించిన ఆవ్యాపారి  3వవాడు తను ఇచ్చినదే  తిరిగి సురక్షితంగా ఇచ్చాడు.అందుకే యజమాని కోపగిస్తాడు. ఇక అరేబియన్ నైట్స్ లో సిందుబాద్ సాహసయాత్రలు వ్యాపార సంబంధమైన కథలు! సింద్బాద్ ఓధైర్యసాహసంగల వ్యాపారి ఓడలో దూర దూర ప్రాంతాల కెళ్లి వ్యాపారంలో లాభాలు అనుభవాలు గడించినవాడు.తన కథను ఓబీద వ్యాపారికి వినిపిస్తాడు. పిల్లలను పెద్దలను ఆకర్షించే కథలు సింధు బాద్ సాహసయాత్రలు🌹
కామెంట్‌లు