వన పర్వము తృతీయాశ్వాసము:-*93 వ రోజు
అశ్వినీదేవతల ఆగమనం
ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను " అమ్మా!నీవెవరు? " అని అడిగారు. సుకన్య " అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను " అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి " నీ వంటి అందెగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త. ఇంకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము " అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి " నాకు నా భర్త మీద ప్రేమ ఉంది " అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి చెప్పింది. చ్యవనుడు సుకన్యతో " వారు చెప్పినట్లు చేయవచ్చు కదా " అన్నాడు. సుకన్య చ్యవనునితో " మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను " అన్నది. ఆమె అశ్వినులతో " నాకు నవయవ్వన వంతుడైన వరుని ప్రసాదించండి " అని అడిగింది. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి ముగ్గురు నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో " మాలో ఎవరు కావాలో కోరుకో " అన్నారు. సుకన్య వారిలో చ్యవనుని గుర్తించి ఆయనను వరించింది. చ్యవనుడు అశ్వినులతో " మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం తాగిస్తాను " అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు.
అశ్వినులకు సోమపానము కలిగించుట
తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడటానికి వచ్చాడు. చ్యవనుడు శర్యాతితో " రాజా! నేను నీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను " అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చ్యవనునితో " వారు దేవ వైద్యులే కాని దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు " అన్నాడు. చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చ్యవనుడు హోమంచేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతిచెందాడు. ఇంద్రుడు చ్యవనుడితో " మహర్షీ ! మీ తపశక్తి తెలియక అపరాధం చేసాను క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు " అని అంగీకరించాడు. చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోను, మద్యం లోనూ, పాచికలలోను, మృగములలోను ప్రవేశించు అన్నారు "
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి