డా ప్రతాప్ కౌటిళ్యా పుస్తక ఆవిష్కరణ-మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో.

 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా కవిత్వం ఆవిష్కరించిన మాజీమంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామవాసి విశ్రాంత అధ్యాపకులు. ఇప్పటివరకు మూడు సైన్సు పుస్తకాలను రెండు కవితా సంపుతులను వెలువరించారు. సైన్సు సాహిత్యంలో దాదాపు మూడు దశాబ్దాల నుంచి చేస్తున్న కృషికిగాను రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని డా ప్రతాప్ కౌటిళ్యా పుస్తకాన్ని ఆవిష్కరించి శాలువా మరియు మెమెంటుతో ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా ఉగాదిక విసమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పలుసా శంకర్ గౌడ్ మరియు బైరోజి చంద్రశేఖర్ సాహితీ కళావేదిక వారు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మరియు రాష్ట్ర ఉన్నత విద్య సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ గారు. ఏసీపి కిరణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ రావుల గిరిధర్ గారు మరియు బుద్ధారం గ్రామ సర్పంచ్ డాక్టర్ లయోలా శేఖర్ గౌడ్ గారు అభినందించారు.
కామెంట్‌లు