క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల ఆత్మగౌరవ దీక్ష

 ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ యునైటెడ్ ఫోరం రాష్ట్రశాఖ, జిల్లాశాఖల పిలుపు మేరకు, ఈ రోజు మండల కేంద్రంలో సిఆర్ఎంటీల ఆత్మగౌరవ దీక్ష పేరిట వినతి పత్రాలను సమర్పించుట జరిగింది. మండలంలో పనిచేస్తున్న సి ఆర్ ఎం టి లు తమ ఉద్యోగ భద్రతను ప్రశ్నిస్తూ ఆందోళన వెలిబుచ్చారు. క్లస్టర్ విధానంలో మిగిలి ఉన్న సి ఆర్ ఎం టి లను అదే క్లస్టర్లో విలీనమయ్యేలా చూడాలని విన్నవించారు. 2016పి.ఎ.బి. ననుసరించి 2019మార్చి నుండి, నేటి వరకూ వేతన పెంపుదల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతూయున్నామని వాపోయారు. పనిబారం పెరుగుతున్నప్పటకీ అందుకు తగ్గ సమానపనికి సమాన వేతనం అందడంలేదని తమ గోడు వినిపించారు. చాలీ చాలని జీతాలుతో తమ కుటుంబపోషణకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని అన్నారు. తక్షణమే తమను ఆదుకోవాలని, తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సత్వర పరిష్కారం చేకూర్చాలని వారంతా స్థానిక అధికారులకు వినతిపత్రాలను అందజేసారు. తహశీల్దార్ మహదేవ్ సరితకు, మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావులకూ ఈ వినతి పత్రాలను అందజేశారు. ఈ ఆత్మ గౌరవదీక్ష పేరిట చేపట్టిన కార్యక్రమంలో సిఆర్ఎంటిలు కె.పుష్పలత,  ఎల్.సూర్యుడు, డి.శ్రీనివాసరావు, పి.రంగనాథం, ఎన్.గుర్నాథరావు, వి.నాగరాజులు పాల్గొన్నారు.
కామెంట్‌లు