సామెత -86- అరిచే కుక్క కరవదు - కరిచే కుక్క అరవదు
*****
"అవ్వా! ఇయ్యాల మా ఇంట్లె పేద్ద లొల్లి అయ్యింది. తల్సుకుంటుంటెనే మల్ల మల్ల గుండెల దడొత్తుంది. గా లొల్లి పంచాతి చూసిన్నాకు రకతం కళ్ల సూత్తనా ఏంది? శాల్తీలు లేత్తయా ఏంది? అన్న బయ్యంతో వొల్లంత సల్లజెమటలు బట్టినయ్. వొణుకుడు బుట్టింది.ఆళ్ళింట్ల ఎన్నన్న బెట్కోని గని గిదేందవ్వ సుట్టపోల్లిల్లన్న ఇంగితం లేకుండా గట్ల లొల్లి జేసుడు.సూశేటోళ్ళు ఏమన్కుంటరు? గీల్లిండల్ల పంచన్లేమో గని పంచాతులే ఎక్కువ అన్కోరా అవ్వా! నేను మా ఇంటాయన గదంత సైన్మా లెక్క సూడాల్సొచ్చింది.
"ఇంతకీ ఏం జర్గిందత్త? ఎవ్వలు గట్ల పంచాతి పెట్టుకుంది?"
గదేనే అవ్వా! మాయక్క కొడ్కు .గీ పంచెనంత గాడే నెత్తిమీద ఏస్కోని జేసిండు.గలాసుల్ల మంచిల్లు బోసుడు కానించి,ఇత్తరాకులు ఏసుడు తీసుడు దనుక గాడే సూసుకుండు. గిట్ల ముందుబడి చేత్తుంటే ఎవడో ఓ తొర్రికూత కూసిండంట. 'గిదంత జేశేది శిన్నమ్మ మీద ప్రేమగాదు.పైసల కాశపడి జేత్తుండు. ఉత్తి పున్నేనికి గీ రోజుల్ల ఎవడు జెత్తడూ!" అన్నాడంట.
గా మాటిన్న వాడు నిప్పు తొక్కిన కోతి లెక్క శిందులెయ్యబట్టిండు. ఇంగ శేతిల కత్తో కటారో ఉంటెె మీద బడి పొడిశేటట్టనిపించిందవ్వా! గాని దగ్గరకి బొయ్యి శేతులు బట్కొని ఒకటే మాట జెప్పినం. నువ్వు జేసే మంచి పన్జూసి వోర్వలేక గట్లన్నరు తీ! ఎవలి పాపం గాళ్ళే పోతరు". అన్న సుత శిందులు ఆపడే". గియ్యాలేదో అయ్యేట్టే వుందన్కుంట కుక్కొతికె గాడు అర్శేది ఇనబట్టినం. గట్ల గా లొల్లి శానా సేపే జర్గింది. అన్నోళ్ళెవలో గని కిమ్మన్నాస్తిగుండ్రు.
గదయ్యిందో లేదో అసలే ఎండకాలమని తలా గిలాసా సల్ల పోశిద్దామని అన్కున్నది యాదికొచ్చి నేను గా మాట అన్కుంట లెవ్వబోతుంటే, శటుక్కున లేచి మమ్మల్ని ఆపిండు. గిలాసల్ల నింపుకొచ్చి పేరు పేర్న అడుక్కుంట బొయ్యబట్టిండు. గీడివేమీ మత్కిల బెట్టుకోలేదని అర్తమైంది అవ్వా!
" గట్లనా అత్తా! గందుకే అంటరు"అరిశే కుక్క కరవదు- కరిశే కుక్క అరవదు" అని. మా బాగ జెప్పినవ్ అవ్వా! గట్లనే గిదంత మన్సుల బెట్కొన్న ఓ సుట్టపాయన మద్దేనం లొల్లి జేసిన అక్క కొడ్కు కమీజ్లున్న ఎయ్యి రూపాయిలు ఎవ్వలు సూడకుండ తీస్కుండంట. మా మన్వడు, మన్వరాలు జూసి చెప్పిండ్రు.
గా నల్లికుట్లాయన తీసింది జెప్తె మల్ల లేనిపోని లొల్లి అన్కుంట పొల్లగాండ్లకి ఎవలితో గీ సంగతి చెప్పొద్దని శెప్పిన.గాడి సంగతి దెల్సినంక"కరిశే కుక్క అరవదు" అని అర్తమైందవ్వా!"
"అవునత్తా! గందుకే మన పెద్దోళ్ళు కుక్కల మీద బెట్టి మడుసుల బుద్దిని గిట్ల తెల్సుకునేటట్లు జెప్పిండ్రు.లోకంల గిస్మంటి మడుసులు ఉంటరు. గందుకే తొందరపడి మంచి శెడులు లెక్కేయొద్దత్తా!"
అవ్వ మాటల్కి అవునే కోడలా! సత్తెం జెప్పినవ్ అన్కుంట, మిగతా పంచెను ముచ్చెట్లు చెప్పసాగింది.
గదండీ సంగతి"అరిచే కుక్క కరవదు-కరిచే కుక్క అరవదు" అంటే గిదే మరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి