సుప్రభాత కవిత : - బృంద
వెన్నెలంటి వెలుగులతో 
వెల్లివిరిసే మనసే 
వేకువొచ్చి వెతలను
వెలివేయాలని కోరికే!

దహియించే బాధలన్ని 
సహించేను హృదయమే 
కురిపించే కరుణతో 
చేరిపేయాలని వినతులే!

గుండెలోని మమతలన్నీ 
గొంతులోనే నింపుకుని 
పిలుపుకోసం వేచిన మదికి 
తీపి కబురివ్వాలని ఆశలే!

నింగిలోని రంగులన్నీ 
కళ్ళలోన నింపుకుని 
కలలు తీరే వేళకోసం కాచిన 
బ్రతుకుల వెలిగించాలని తపనలే!

బెదిరించే భయాలను 
అదిలించే ఆపదలను 
ఎదురొచ్చే ఆటంకాలను 
తొలగించేయాలని విన్నపాలే!

చిత్తములో పేరిన చీకటిని
మొత్తంగా తరిమేసే 
కొత్తవెలుగు  కిరణాలతో 
పుత్తడి స్వప్నాలను నిజంచేసే...

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు