రాయలసీమ మహాకవి సమ్మేళనంలో రత్నలక్ష్మికి ఘనసత్కారం

 రాయలసీమ ప్రాంత సాంస్కృతికోద్యమ వికాసంలో భాగంగా రాయలసీమ ప్రసిద్ధ ప్రదేశాలు అనే అంశంపై రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ సెమినార్ హాల్ అనంతపురంలో నిర్వహించిన మహాకవి సమ్మేళనంలో జలవనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రత్నలక్ష్మి జల సిరులగంగ తెలుగు గంగ అనే శీర్షికతో అద్భుతంగా కవితాపఠనం గావించి సభను అలరించిన సందర్భంగా పలువురు కవులు, కవయిత్రులు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. . ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ముఖ్య అతిథి మాజీ  ఉపకులపతి రామకృష్ణారెడ్డి, తరిమెల అమర్నాథ్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు బండి నారాయణస్వామి, శాంతి నారాయణ స్వహస్తాలతో సత్కరించారు. 
ఈ విశిష్ట సత్కారం పొందిన సందర్భంగా సాహితీ సంస్థల ప్రతినిధులైన డాక్టర్ గుర్రాల రవికృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ మురళి డాక్టర్ గెలివి సహదేవుడు మరియు సహోద్యోగులు బంధుమిత్రులు రత్నలక్ష్మిని అభినందించారు.
కామెంట్‌లు