అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట
వెంటనే అర్జునుడు ఇంద్రకిలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుడుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆపంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో " నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా " అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా " అన్నాడు శివుడు.
అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది " ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి " అనుకున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి " అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు వేసే బాణముల నన్నీ శివుడు పర్వతం శిలావర్షాన్ని స్వీకరించి నట్లు స్వీకరించాడు. అక్షయ తూనిరాలలోని బాణాలు అన్ని అయిపోయాయి.గాండీవం తీసుకుని కొట్టగా అతని చేతిలోని గాండీవం అదృశ్యం అయింది.ఖడ్గం తీసుకొని శివుని శిరస్సుపై బలమంతా ప్రయోగించి కొట్టగా ఖడ్గం ముక్కలై పోయింది. చెట్లతోనూ శిలలతోను యుద్ధం చేశాడు. అన్నిటిని శివుడు తనలోనికి తీసుకున్నాడు. ఇక పిడికిళ్ళతో శంకరుడిని కొట్ట నారంభించాడు. కిరతార్జును లిరువురు భయంకరంగా ద్వంద యుద్ధం చేయసాగారు. కొంతసేపటికి అర్జునుడు శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు.కాసేపటికి తేరుకుని రక్తసిక్తమైన తన శరీరమును చూసుకొని మట్టితో శివలింగమును చేసి పుష్పములు, మాలలతో పూజించాడు. అప్పుడు పార్ధివ లింగంపై తను పూజించిన మాల కిరాతుని శిరస్సుపై కనిపించింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు కిరాతకుడే శివుడని గ్రహించి కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. " పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు " అన్నాడు. అంత నిజ రూపంలో ప్రత్యక్షమైన శివుడు " అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి . ఇదిగో నీ గాండీవం .ఇంకా ఏదైనా వరం కోరుకో " అన్నాడు. అర్జునుడు " త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు " అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం , సంధానం, మోక్షణము
సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.శివుడు అర్జునుడితో " అర్జునా! ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము " అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి