వినూత్న కార్యక్రమాలతో విషయ పరిజ్ఞానం: - ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 -ఊషన్నపల్లి ప్రభుత్వ  పాఠశాలలో ఘనంగా ఇద్దరు విద్యార్థినుల జన్మదిన వేడుకలు

వినూత్న కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థుల్లో విషయం పరిజ్ఞానం పెంపొందుతుందని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులు తోట ఆరాధ్య, తోట ఆరూహి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో కవల విద్యార్థినుల జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబై పాఠశాలకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు తన తోటి సహచరులతో ఆనందంగా గడిపారు. ఇద్దరమ్మాయిలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. అమ్మాయిలకు వారు స్వీట్లు తినిపించి, దీవించి, ఆశీర్వదించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పాఠశాల పిల్లలు ఆరాధ్య, ఆరూహిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లల పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందని, పిల్లల కళ్ళల్లో ఆనందం వెల్లివిరియాలనేదే  తమ ఆశయమని ఆయన అన్నారు. పిల్లల సంతోషం కోసమే పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.  పాఠశాల అభివృద్ధి ప్రతి ఒక్కరూ విరివిగా విరాళాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లల సర్వతోముఖాఅభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. సకల సౌకర్యాలు, చక్కటి ఉచిత విద్యను  అందిస్తున్న ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించి వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోవద్దని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్.ఎం. ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేష్ కుమార్, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు