అన్నీ సవ్య ముగా వుండి ఏమీ సాధించ లేని వారెందరో...! ;- .. కోరాడ నరసింహా రావు!
శారీరక లోపా లున్నా... 
 ఎన్నెన్నో  ఘన కార్యాలు
సాధించినవా రెందరెందరో

మనోబల మున్న వారిని 
 అంగ వైకల్య మేమీ చేయ లేదు...! 

వారి ఆత్మ విశ్వాసమే వారిని గెలిపిస్తుంది..!! 

సాధారణంగా అంగ వైకల్య మున్నవారిలో ... ఏదో ఒక ప్రత్యేక శక్తి  సాధారణ వ్యక్తులలో లేనిది... ఉండే తీరుతుంది...! 
   అంగవైకల్యం శాప మనుకున్న వారు దీన్ని వరంగా భావించాల్సిందే ! 

వీరిని దివ్యాంగులు అంటారు...! 
 వీరు నిజంగా  దివ్యాంగులే... ! 
 అందరి కంటే వీరిలో ప్రత్యేకంగా ఓ దివ్యమైన శక్త్యంగము ఉండే తీరు తుంది...!! 
  అదే వారిని అద్భుతంగా నడిపిస్తుంది..! 

అటువంటి వారిని అందరూ ప్రోత్సహించాలే గానీ, చిన్న చూపు చూడరాదు...!! 
      ****


కామెంట్‌లు