సామెత -72: అతుకుల కాపురం -చితుకుల మంట వంటిది
*****
"అవ్వా! ఇంగ నా వల్లగాదు గీ సంసారాన్నీద.నెత్తినిత్తులు పడ్డ కానించి ఏనాడూ సుకపడ్డది లేదు.పొద్దత్తమానం శేసి శేసి రెక్కలు బోతున్నయి.పది రూపాయలిచ్చి ఇర్వై రూపాయల లెక్క అడ్గుతడు. కర్సయినయంటె గట్లెట్ల కర్సు బెడ్తవ్ నాకు దెల్వకుండని పంచాతి కొత్తడు.గీ కాపురం జెయ్య నా వొల్ల గాదు.ఎప్పుడూ రసరసే కొంపల.ఎంతకని ఓర్సుకోనవ్వా? ఓ సంబురం ,సర్దా లెవ్వు.ఉన్న దాంట్లె గుట్టుగ ఎట్లనో గట్ల అతికిచ్చి,పొతికిచ్చి ఇల్లెల్ల దీత్తుంటె ఆయ్నకి అస్సలు తెల్వట్లె.గీ సొదంత నీకు జెప్పుకొని గింత ఉప్శవనం పొందనీకి వచ్చినవ్వా!"
గద్సరేగని కామాచ్చీ! గాలచ్చి గాని సంగతి నీకు తెలిసిందే కదా! వొయసు పెర్గింది గానికింక ఇవురం రాలేదే!బాద్దెత మీద పడ్తె గని జెర నెమ్మదిగా అవే తెలుత్తయి. పొల్లగాండ్లు ఎద్గుతుండ్రు.గాల్ల ముందు సితుకుల మంట లెక్క సిటపటలాడ్డమేన? త్యేప త్యేపకి మీరిట్ల లొల్లి బెట్కొంటే ఏం బాగుంటది శెప్పు?"
"గంతెలే అవ్వా! ఎంతైన కొడుకొర్సని ఎన్కెసుకొత్తున్నవ్ తీ! అత్త అత్తే అని మంచిగనె బుద్ధి శెప్పినవ్! "అన్కుంట లెవ్వబోతున్న కామాచ్చిని ఆపి కూస బెడ్తూ...
"గిదేనా నన్నర్తం శేసుకుంది కామాచ్చి.ఆడు మంచోడంటున్ననా? ఇవురం తక్వోడనే గద శెప్పింది. గాడెంత జెల్సాలమారోడో నాకు తెల్వదా? నే సూత్తనే ఉన్నగదనే! ఏజ్జెప్పినా కంపల బడ్డ కుక్కోలె కయ్యి కయ్యిమనుడే తప్ప ఎంద్కు జెప్పిండ్రన్న గ్యానం లేదాడికి. మన్సులు కల్వని కాపురాలు అత్కుల బొంత లెక్కనే సిరుగులు బట్టి ఉంటై. మంచి బంధమసుమంటి గట్టి సీర గుడ్డతో కుడ్తె అత్కులు కన్పడక అందంగ అగుపిత్తది.గది నువ్వు జేత్తున్నది నీ లగ్గమైన కానించి సూత్తనే ఉన్నగదనే! వాని కాలమే నడ్సుడు గాదు .నీకు సుత మంచి కాలమొత్తది.గీ అవ్వ జెప్పింది పాటి అవుద్ది ఇనుకో."
అవ్వా!అవ్వా !తప్పయింది.గప్పుడు నువ్వు జెప్పబట్టే తాడు కుద్వబెట్టి మిషను కొనుక్కున్న. గిప్పుడు గా మిషనే నా తాడు నాకు మల్ల తెచ్చింది. మా పొల్లగాండ్ల శిన్న శిన్న కోర్కెలు తీరుత్తుంది. గది నీ సల్వే అవ్వా!"
గంత మాటెందుకే కామాచ్చి.నా బిడ్డస్మంటి దానివి. కాపురంల పంచాతీలు సితుకుల మంట లెక్క ఉండాలి. గా మంట ఒక్కసారి బుస్సుమని పైకి లేత్తది అంతట్లనే ఆరిపోద్ది.సంసారం సుత గట్లనే ఉండాలె.కూసింతోపిక బట్టు.ఆడే సక్కగొత్తడు మల్ల..." అవ్వ మాటల్కి సంబురపడ్కుంట "గట్లనే ఉంటవ్వా! అన్కుంట ఎల్లిపోయింది.
గదండీ సంగతి!అతుకుల కాపురం అంటే సాలీ సాలని సంసారం.ఇగ చితుకుల మంట సంసారం సాలిసాలకుండ జేసేటప్పుడు సితుకుల మంట లెక్క మొగుడు పెళ్ళాల మద్దెన శిన్న శిన్న పంచాతీలు వత్తా పోతా ఉంటాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి