ప్రేమించమంటున్నారు
ప్రేమలోపలే ఉండమంటున్నారు
మనం ప్రేమలోనే ఉన్నాం
ప్రేమలోపలే ఉండటం అంటే
తిరిగి
మనం ప్రేమలోంచి బయటికి రావటమే!!?
శాంతించమంటున్నారు
శాంతి లోపలే ఉండమంటున్నారు
శాంతి లోపలనే ఉండడమంటే
శాంతి లోపల నుంచి బయటికి రావటమే!!?
సంతోషంలో ఉండమంటున్నారు
మనం సంతోషంలోనే ఉన్నాం
తిరిగి
సంతోషంలోనే ఉండడం అంటే
సంతోషం లోంచి బయటికి రావటమే!!?
నిర్మాణంలోనే ఉండమంటున్నారు
మనం నిర్మాణంలోనే ఉన్నాం
తిరిగి
మనం నిర్మాణంలోనే ఉండడం అంటే
నిర్మాణంలోంచి బయటికి రావటమే!!?
లోపలికే వెళ్ళమంటున్నారు
మనం లోపలే ఉన్నాం
తిరిగి
మనం లోపలికి వెళ్లడం అంటే
లోపలి నుంచి బయటికి రావటమే!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి