సాహితి కెరటాలు
==============
సంకల్పం కలిగినదైతే విజయం
గమ్యం పట్టుదల సాధన పరుగే
చేర్పించును తన స్థానం.
కలత చెందితే కళ్ళల్లో కన్నీళ్లు కలిగిస్తుంది.
కదం తొక్కితే కళ్ళల్లో కాంతులు కలిగిస్తుంది..!!
ఆరాటం ప్రదర్శించే గుణం మనిషిలోనా
మనిషికున్న మనిషికున్న ధనమని
తెలియజేస్తుంది అధర్యపడితే పిరికి బ్రతుకు
నిదర్శనంగా సూచిస్తుంది
విజయ గమ్యం అనేక అనుభవాల
బ్రతుకు పాటల తీరం..!!
ధనం మెంతున్న మనిషికి
బలాన్ని ఇచ్చేది మనోధైర్యం
మన ధైర్యమే మనిషిని చేరుస్తుంది విజయ గమ్యం అని
తనలో తానే తెలుసుకునేలా
కనువిప్పు కలిగేలా బ్రతుకు పాఠం నేర్పిస్తుంది
విజయ గమ్యం..!!
సంకల్పం బలమైనది అయితే చావి చిన్నదని బ్రతికే ఎదురు నిలుస్తుంది.
ఓటమి ఎగిరితే ఉదాహరణంగా నిలుస్తుంది
గెలుపు కేతనం ఎగరవేస్తే స్ఫూర్తిగా మారుతుంది
విజయ గమ్యం సాహసం చేస్తే చేరుకునే విలువైన స్థానం గమనం..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి