మధుర కవిత్వం :- ఓగిరాల గాయత్రి విజయవాడ
సాహితీ కవి కళాపీఠం,
సాహితీ కెరటాలు,
============
జీవితం ఓ తెల్లరంగు కాగితం.!   
చిరుగాలికి నేస్తమై సంచరిస్తున్న నాపై, 
అక్షర మాలికల పేరుతో మధుర కవిత్వమై న
న్నుపులకరింప జేస్తోంది.!

ఎక్కడో రాజరికపు కోటల్లో పుట్టి, ఇక్కడ గుండె లోతుల్ని తట్టింది  కవితేగా మరి.!

శ్రమతో కూడిన ప్రాస కనబరుస్తూ, పవిత్ర ప్రేమతో కూడిన ఆశ వెలువడుతోంది.!

సరళ సాహిత్య మాధురీ ఈ కావ్యాంజలి,
సిరుల మహత్య కానుకగా ఈ భాష్యాంజలి, 
రంగ రంగ వైభవం కనిపిస్తుంది ప్రతీ అక్షరం లో !

తరంగ మృదంగ స్వభావం తాండవిస్తూ, 
ప్రతి పద పక్షంలో సర్వాంగ సుందరమైన కావ్య మనోహరం, నేటి కవితా ప్రపంచానికి ఓ నవ్య అలంకారమే.!

అల్లికల జిగిబిగితో, ముద్దు పలుకులతో,  
అనన్య కల్పనా చాతుర్యముతో, మధుర భక్తి ఆవేశముతో ప్రభంధాలను రచిస్తోంది.!

ఏదో తెలియని  బంధంతో, ప్రతీ క్షణం సుందరమై, 
స్నేహ భరితమై మనసు ఆనంద మయమౌతోంది.!

చాలు కదా ఈ సామాన్య జీవితానికి అసమాన్య అగ్ర తాంబూలం.!


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది మీ కవిత