ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) "బాల సాహిత్య భేరి"పేరుతో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని మల్లగల్ల హయతి పాల్గొని ప్రశంసా పత్రం పొందినట్లు తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, మలేషియా, భారత్ దేశాల నుండి ఎంపిక చేసిన మొత్తం 101 మంది బాల బాలికలు కథ, కవిత , పద్యం, గేయం విభాగాల్లో పాల్గొని తమ రచనలను వినిపించారు. కాగా హయతి గేయ కవితను వినిపించి ఆకట్టుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు తానా ప్రతినిధులు ప్రశంసాపత్రాన్ని బహుకరించారు. తమ విద్యార్థిని అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, సంధ్య, సలోమి హయతిని, గైడ్ టీచర్ శ్రీనివాసరావుని అభినందించారు.
అంతర్జాతీయ సమ్మేళనంలో -ఆయుధ కర్మాగారం విద్యార్థిని
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి