సుప్రభాత కవిత : - బృంద
ఫలమందే  తరుణంలో 
పంటను చూసిన పుడమి
పురిటిలో బిడ్డను చూసి 
పరవశించే తల్లయిపోదా!

తొలికిరణం తాకిన పైరు 
తలవంచి నుతులు చేసి 
తరలివచ్చు తండ్రి ప్రేమను 
తనివితీరా అనుభవించదా!

తనయుల  ఆకలితీర్చి 
తరముల వృద్ధిని కూర్చి 
తప్పులెన్నో చేసినా  
తనబిడ్డల  నేలతల్లి రక్షించదా!

పంటలింటికి వచ్చు
పర్వమంటి సమయాన
పచ్చటి వెలుగులు పంచి
పండుగ మనసుకు అందించదా!

ఉదయమే ఏతెంచి
ఉషోదయ వెలుగులతో
ఉర్వికి ఊపిరి పోసి
ఉత్సాహం నింపే వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు