శిశువు
బొట వ్రేల ముల్లోకములు చూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లిదండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ బెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమును వ్యత్యాసమెరగకా
స్వాదింప జను వెర్రి బాగులాడు
అనుభవించు కొలంది నిను మండించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలము
భాష రాదు వట్టి పాలు మాత్రమే త్రాగు
నిద్రవోవు లార్చి నిలువ లేడు
ఎవరెవరుంగరి తనదే దేశమో కాని
మొన్న మొన్న నిలకు మొలిచినాడు
- ఇది గుర్రం జాషువా గారు శిశువు మీద చెప్పిన సీస పద్యము.
జాషువా గారు జన్మించింది అక్టోబర్ నెలలోనే. ౧౮౯౫ అక్టోబర్ 28 వ తేదీన వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ప్రకృతే ప్రధాన గురువైంది. జాషువా గారు విశ్వ మానవ మతాభినివేశంతో కరుణ రసం కలబోసి భారత మాతకు కల్పనాకల్ప కవితామందిరాలు నెలకొల్పారు. అలా ఆయన రాసిన బోలెడు కవితల్లో శిశువు పై అల్లిన పద్యాలకు ఎంతో ఆదరణ లభించింది. భూమ్మీదకొచ్చిన శిశువు తీరు తెన్నులను పొందికైన మాటలతో చెప్పిన జాషువా గారు అనేక ఖండ కావ్యాలు రాశారు. ఈరోజు చెల్లుబడిలో ఉన్న నుడికారం పై వారిది అద్వితీయమైన అధికారం. ప్రాచీన సంప్రదాయానికి వారితో సంపూర్ణ సహకారం లభించింది. వారి గబ్బిలం రచన చదువుతుంటే మన మనస్సున హత్తుకుపోతుంది అని ప్రత్యేకించి చెప్పక్కర లేదు.
ఆయన ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత 1919 నుంచి తొమ్మిదేండ్లు గుంటూరు ట్రైనింగు స్కూలులో కొలువు చేసినా ఆ తర్వాత ఉభయభాషాప్రవీణ చేశారు.
తెలుగు పండితులుగా ప్రచారకోపన్యాసకులుగా ఆ తర్వాత రేడియోలో ప్రొడ్యూసర్ పదవి చేపట్టారు. ఆయన ఏ పదవిలో ఏ హోదాలో ఉన్నా ఆ పదవికి అన్ని విధాలా తగు న్యాయం చేసి అందరి మెప్పు పొందే వారు.
గుంటూరులోని అరండల్ పేటలో గోపాల కృష్ణయ్య తోట ప్రాంతంలో మతముల్ వర్ణము లడ్డు గోడలయి ప్రేమన్ రాక్షసత్వంబుతో హత మార్పం బ్రయతించే ఈ కాలంలోనే సాహిత్యాభిమానులు కట్టించి ఇచ్చిన గృహంలో ఆయన నివసించారు. కావ్యాలలోనే కాకుండా జీవితంలోనూ నిండుగా నవ్వగల గుండె గల వారైన జాషువా గారు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచేవారు. కాలకృత్యాలు తీర్చుకునే వారు. తొమ్మిదిన్నరకు భోజనం చేసేవారు. కాస్సేపు విశ్రమించి పద్యాలు రాయడం చేసేవారు. ఎవరన్నా వస్తే మధ్యాన్నం పూట మాట్లాడే వారు. సాయంకాలము ఎక్కడికీ వెళ్లే వారు కాదు. మరీ మరీ అత్యవసరమైన పని పడితే తప్ప. గాంధీగారిని చూడడానికి వార్దాకు వెళ్లిన జాషువా గారు తర్వాతి రోజుల్లో గోపరాజు రామచంద్ర రావు (గోరా) వారితో వియ్యం పొందారు.
విశ్వమానవ సౌభ్రాత్రం నిర్మిత నిర్జాతి సంఘం నా ఆదర్శం అంటూ కవిత్వం చెప్పడంలో తనకంటూ ఓ ప్రత్యేక పంధా అనుసరించారు.
ఆయన రాసిన గబ్బిలం కావ్యం ఒక అభాగ్యుడి అశ్రువుల గాథ. ఈ కావ్యంలో ఆయన బాష్ప సందేశం ప్రధానం. నెలబాలుడు వెన్నెలలు విరజిమ్మే వరకు ఆయన కావ్యాలు నిగనిగలాడుతాయి అనడంలో సందేహం లేదు. ఆయన ప్రతి పద్యమూ వెలుగు దివ్వలే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి