సీసమాలిక!!
--------------
ముప్పది మూడేండ్లు ముకు బంటి కష్టాల
మునుగుచు డ్యూటీల మోసినాము
అరకొర భత్యాల నావిరై కోర్కెలు
గష్టాల కడవల జేదినాము
బదిలీల పరుగులు గుదిబండగా మారి
యిల్లాలు పిల్లలు నిగిరి నారు
తినిన బోవుననుచు మునిపంటి బిగువున
పీ.పి.ఎఫ్ జమజేసి పెనగి నాము
నధికార్ల కోపాల రుసరుసల నడుమ
కర్తవ్య పాలన గరపినాము
నూరంత సరదాలు నూరించు చున్నను
కట్టుబాట్ల గిరిలో గరిగినాము
పెరుగు జీతమనుచు పీయార్సి కొఱకునై
ఎండమావిజలము కెదురుజూచి
కండ్లు కాయలు గాచి కష్టాలు ముసిరెను
పిల్లల పెళ్ళిల్లు బెంకు లయెను
పదవి విరమణలో బైకంబు లివ్వక
యుద్యోగి ప్రాణాలు నురికి యురికె
చిన్న పెద్ద దొరల చిత్తంబు కరుగదు
చిరుత యుద్యోగులు జీమ కలుసు
పదవుల కొట్లాట పందేల యాటలో
మరచిరి పెన్షనర్ మరణ కాండ!!
తే.గీ!!
------
కనులు దెరవండి యికనైన కఠిను లార!
మీదు విలసాల ఖర్చులో మాది యెంత?
యెసరు బెట్టిన యుద్యోగి యుసురు తోడ
గూలి పోవుచు రాజ్యాలు రాలి పోవు!!
-:పెన్షనర్ల కష్టాలను చూసిన సానుభూతితో...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి