సంక్రాంతి! :- గంగరాజుపద్మజ-8688807575 హైదరాబాద్

 వస్తుంది సంక్రాంతి,వద్దనం దాన్ని
వద్దన్నా వచ్చేటి ముద్దైన సంక్రాంతి
చలి వణుకుల మధ్య తళుక్కున మెరుస్తూ కులుకుతూ
రైతులిళ్లకు బళ్లపై ధాన్యలక్ష్మి 
పాలేళ్లకు పనివాళ్లకు సోలల్లో కొలిచే గృహలక్ష్మి
గంగిరెద్దుల మేనిపై రంగురంగుల దుప్పట్లు,మేళాలు చిందులకు 
సంబరంతో పిల్లల చప్పట్లు
ఇరుగుపొరుగు ముగ్గుల్తో పెనవేయు రంగవల్లులు
తాత గారిచేత కూష్మాండం
అందుకునే బ్రాహ్మణులు
బుడబుక్కలాళ్ల మెడలపై ఉన్ని కంబళ్లు 
అరిసలకై బియ్యం దంపుళ్లు చలిమంటల నెగళ్లు 
కొత్త బియ్యం బెల్లంతో
ఉడుకుతున్న పొంగళ్లు
రేగు చెరుకు ముక్కలు నాణాలు
బాలలతలలపై భోగిపళ్లు
దీవించు పేరంటాళ్లు
ఆధ్యాత్మిక సామాజిక ఘట్టాలతో 
బొమ్మలకొలువులు
మన సంస్కృతి సాంప్రదాయాలకి లోగిళ్లు 
పెద్దపండుగ సంక్రాంతి,తెచ్చు శుభాలు క్రాంతి🌹
కామెంట్‌లు