సంప్రదాయ భోగి పండుగ అంతరార్థం - సంక్రాంతి: - " కావ్యసుధ "-9247313488

 మన పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి, ఆధ్యాత్మిక చింతనకు మార్గ నిర్దేశికతను సూచి స్తాయి. మకర సంక్రాంతి మనకు సంప్రదాయ సిద్ధమైన గొప్ప పం డుగ. ఈ సంక్రాంతి పండుగను గ్రామీణ ప్ర ప్రజలు, రైతులు ఆనందోత్సాహాలతో మూడు రోజులు గొప్పగా జరుపుకుంటారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదకు భారతదేశం ఆలవాలము. భారతీయ సంప్రదాయము లన్నియూ సకల జనులకు ఆదరణ యోగ్యములు,
"జననీత్వం హీవో కానాం సప్తమీ
సప్త సప్తికే వ్యాహాతికే దేవి నమస్తే" సప్తశ్వయ ములతో విరాజిల్లే ఓ సప్తమీ నీవు అన్ని లోకాలకూ మాతృ కవి. సర్వశక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణ ప్రదాత అయిన శ్రీసూర్య భగవానుని ఈ లోకానికి అం దించిన జననీ నీకివే వంద సములు అంటూ 'మకర సం క్రాంతి' నాడు సూర్యభగవానుడిని ఆరాధిస్తూ జనులు పూజలు నిర్వహిస్తారు.
'సంక్రాంతి' అంటే సూర్యాది గ్రహరాశుల అంతర గమనం అని చెప్ప బడింది. సూర్యుడు ఒక నిర్దిష్టమైన కాల గమనంతో సంచరించుచూ ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించ డాన్ని 'సంక్రమణం' అన్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని 'మకరసంక్రమణం' లేదా 'సం క్రాంతి' అంటారు.
'సం' అంటే చక్కని, 'క్రాంతి' అంటే 'మార్పు', కాబట్టి 'సంక్రాంతి' అంటే చక్కనైన మార్పుతో కూడిన చైతన్యం అని అర్థం. 'మకరం' మొసలి పట్టుకు సంకేతం. సంక్రాంతి పండుగ మనకు ప్రతి సంవత్సరం జనులకు వరి నిచ్చెనెలయైన జనవరిలో పుష్యమాసంలో, హేమంత ఋతువులో వచ్చే సంక్రాంతి ప్రత్యేకమైన విశిష్పత ఉన్నది.
సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంతవరకు దక్షిణాయణంలో తిరుగుతున్న సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు. ఇది మహా పుణ్యకాలం. ఇది దేవతలకు ప్రీతి కరమైన కాలంగా మన
పురాణాలు తెల్పుతున్నాయి. ఆ రోజు స్వర్గ ద్వారాలు తెరువడి ఉంటాయని, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని, అందుకే భీష్మా చార్యులు - ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అంపశయ్యపై నిరీక్షించి ఆ పుణ్యకాలంలో బ్రహ్మైక్యమయి నట్లు మహా భారతంలో ఉంది.
ఉత్తరాయణ కాలంలో మరణించిన వారి అంత్య క్రియలు సూర్యస్తమయంలోగానే నిర్వహిస్తారు. అదే
దక్షిణాయణ సూర్యాస్తమయ కాలంలో మరణిస్తే, ఆ మరుసటి రోజున సూర్యోదయమైన పగటి కాలంలో అంత్యక్రియలు చేయడంలో గల అంతరార్థం ఉత్తరా యణం పుణ్యకాలం కావడమే !
మకర సంక్రాంతికి ముందున్న సంక్రాంతి ధను స్సంక్రాంతి. ఈ ధనుర్మాసం దేవతలకు ఉషః కాలం వం టిది. మకర సంక్రమణం మన జీవన సౌభాగ్యానికి  సంకేతంగా నిలిచిన పర్వం.
ప్రతి సంక్రాంతి పర్వ దినమున 'సంక్రాంతి పురు షుడు' ఒక్కొక్కరకమైన వాహనంపై అధిష్ఠించి వస్తా డనే విశ్వాసం అలా అతడు ఎక్కివచ్చే వాహనాన్ని బట్టి ఆ ఏడాదిలో జరగబోయే సంఘటనలను ఊహిస్తారు.
 ఈ సంక్రాంతి పండుగను తొలిరోజు భోగి. మల్లి రోజు సంక్రాంతి గా, మూడో రోజున కనుమగా మూడు రోజులు జరుపుకోవాలని మన తెలుగు సంప్రదాయం.
''సంక్రాంతి' ఈ రోజు ప్రాతః కాలములోనే అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్నలు పెద్దల ఆశీర్వాదములు పొందుతారు. 'సంక్రాంతి' రోజున స్నానా దులను ఆచరించని వారు ఏడు జన్మల పాటు రోగి అవు తాడని శాస్త్రోక్తి. రోజు ప్రాతః కాలములోనే నువ్వుల నూనెతో తలంటుకొని చేసే అభ్యంగన స్నానానికి విశేష
ప్రాముఖ్యత ఉన్నది.
'భోగి' పండుగ అంటే అన్ని భోగాలనూ సమకూ రుస్తుందని శాస్త్ర వచనం. శీతాకాలం స్తబ్దతను పోగొ ట్టేందుకు తెల్లవారు జామునే భోగిమంటలు వేసుకొని చతిని పారద్రోలడానికి ప్రయత్నిస్తూ, దక్షిణాయమునకు వీడ్కోలు పలికి, ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు భోగి పండుగ. ఈ భోగి మంటల వల్ల హే మంత ఋతువులో చలితోపాటూ విజృంభించే క్రిములు, ప్రాణులకి అపకారాన్ని కలిగిస్తాయి కనుక మన ప్రాచీ నులు ఎక్కవ సంఖ్యలో క్రిములుండే తెల్ల వారు జామున పెద్ద మంటల వల్లవచ్చే దాహక శక్తికి, క్రిములన్నీ నశిస్తా యనే భావనతో భోగిమంటలను ఏర్పాటు చేశారు.
భోగి పండుగ రోజే ఐదు సంవత్సరాల పిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక సంప్రదాయం. రేగు పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, పూలు కలిపి భోగి పండ్లు పేరిట పేరంటానికి వచ్చిన ముత్తైదువులు పిల్లల తల చుట్టూ మూడు స్టార్లు చుట్టి పోస్తారు. ఇలా పోయ డం వల్ల పిల్లలకు సంవత్సరం పాటూ తగిలిన దృష్టి దోషం తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం. సాయం వేళ పేరంటాలకు పసుపు, కుంకుమ, అరటి పండ్లు, నువ్వులు చెక్కర కలిపిన మిశ్రమాన్ని దక్షిణ తాంబూ లలతో వాయనాలు ఇవ్వడం ఆనవాయితి.
సంవత్సరమంతా రైతులు శ్రమపడి కష్టించి పం డించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునే పండుగ సంక్రాంతి. తమ కష్టఫలమైన పం టను చూసి పడిన శ్రమంతా మరచిపోయిన రైతు కొత్త ధాన్యంతో పాలను చెక్కర కలిపి 'పొంగలి' తయా రుచేసి మనకు ప్రత్యక్షదైవమైన సూర్యదేవునికి నైవేద్య ముగా సమర్పించి కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు.
పరోపకారమే ధ్యేయంగా గల మూగ జీవులను గౌరవించడానికై ఏర్పాటు చేయబడినది 'కనుమ' అంటే పశువు అని అర్థం. ప్రపంచమంతా భగవత్ స్వరూ పంగా భావించి, అనంతకోటి ప్రాణి పట్ల ట్ల దయార్ద హృద 'యమును కలిగి ఉండాలనే భావనతో 'కనుమ' రోజున మూగజీవాల పట్ల ప్రేమను తెల్పుతూ రైతులు పశు వులను శుభ్రంగా కడిగి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి కాళ్లకు గజ్జలు తొడిగి, పూల మాలలు వేసి పూజిస్తారు. ఈ రోజు గోవును పూజిం చడం వల్ల అనంతమైన పుణ్యఫలం పొందుతారని శాస్త్రోక్తి, లోకంలో సంతానికి గోవు సంకేతం. ధర్మానికి ఎద్దు సంకేతం కాబట్టి ప్రతి వ్యక్తికీ కావలసినది ధర్మ పరమైన సంతానం ఈ గోవు పూజలో మనకు తెలుస్తుంది.
కనుమ రోజు గుమ్మడి కాయలు, బెల్లం, నువ్వులతో చేసిన వృషభాన్ని దానం చేయడం వల్ల రోగ విముక్తుల వుతారు. స్త్రీలు పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, పూలు వస్త్రదానం చేయడం వల్ల మాంగళ్యాభివృద్ధి జరు గుతుంది. మకర సంక్రాంతి నాడు ఉప యోగించే నువ్వులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు, బీర, పొట్ల, గుమ్మడి వంటి కూరగాయలు, బంతి, చేమంతి పువ్వులు శారీరక ఆరోగ్యానికి పౌష్యలక్ష్మీ హేమంత ఋతువులొ మనకు ప్రసాదించినవి.
బొమ్మల కొలువులు, కోడి పందాలు, జంగ దేవర్లు, గంగిరెద్దు దాసర్లు, పశు పూజలతో, ధాన్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ సాంప్రదాయ పద్దతిగా జరుపుకొనే మకర సంక్రాంతి వైభవ శోభకు పల్లె సీమలే సాక్ష్యం.
================================================

" కావ్యసుధ "-9247313488 
'వాజ్ఞ్మయ భూషణ'
" సాహితీ శిరోమణి "
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హయత్ నగర్ : హైదరాబాదు
కామెంట్‌లు