వేమన కందాలు: - మమత ఐల-9247593432
 కం.
కోపించుట తగదనియెడి
దీపము కవి వేమనేను, దివ్య చరితుడై
చూపెను జనులకు దారిని
దాపున నిలచిన విధముగ ధైర్యమొసగుచున్
కం.
తుంచెను హీనుల గుణమును
కొంచంబధినేతలైన కొండతొ పోల్చెన్
యెంచుచు పలుకుల బేధము
కంచుకు పుత్తడికి నడుమ ఘనతను చూపెన్
కం 
చెప్పెను వేమన మృధువుగ
ముప్పుల జాగ్రత్త లన్ని వాహిని వోలెన్
తప్పని పలుకుల మాలగ
విప్పెను కష్టముల గూడు వివరణ తోడన్
కం
అప్పటి వేమన పద్యము
లిప్పుడు మారుచు నిజముగ రేపటి హృదిలో
కుప్పగ జ్ఞానము నింపెను
నిప్పున బడి జారకుండ నిలకడ నేర్పెన్
  
వేమన -తేట గీతులు
*******************
తే. గీ
నిత్య జీవిత సత్యాల నిజమునంత
పూస గుచ్చిన విధముగా పొందు పరచి
జరుగబోయెడి పరినామ చరితదిశను
చక్కగా జెప్పె వేమన సద్ఋషిగను
తేగీ
ఆధునికమైన హితముల శోధనంత
వేదమై విస్తరించెను బారి గాను
మూల్యమైనట్టి పద్యాల ముత్యములను
యోగి వేమన్న జెప్పెను యెరుగుమనుచు

కామెంట్‌లు