సావిత్రి భాయి పూలే: - మంజుల పత్తిపాటి-- చరవాణి 9347042218
అక్షర బాణాలు సంధించి
పిరికితన మూలలను కూల్చేసిన ధీశాలివి

అక్షర జ్ఞాన అమృతధారలతో
మహిళల జీవితాన ఆనందము
నింపిన వెలుగు జ్యోతివి

బాల్య వివాహాలు ఎదిరించి
చదువులను కానుకగా ఇచ్చిన
చదువులతల్లివి నీవు

సమాజపు చీకట్లను చేండాడి
అతివల్లో జ్ఞాన కాంతిని నింపింన
విప్లవ జ్యోతివి నీవు

అక్షరం ముక్క నోచుకోని కాలాన
ఎన్నో అడ్డంకులు అవమానాలు
ఎదురైన వెనకడుగు వేయకుండా
మహిళా అభ్యున్నతికి కృషిచేసిన
ధీరవనితవు

తొలి మహిళాఉపాధ్యాయురాలుగా
స్త్రీ శక్తి ని  ప్రపంచానికి చాటినావు

వితంతువు ల కన్నీళ్లు తుడిచి
అక్షర మాత్ర వేసి సమాజ కట్టుబాట్లు
తుంచేసి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించిన
కరుణామూర్తివి

సావిత్రి భాయి పూలే గారి జయంతి సందర్భంగా
మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
==================================
మంజుల పత్తిపాటి-- చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
 చరవాణి 9347042218

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Happy teachers day


చాలా బాగుంది