మకర సంక్రాంతి: - మంజుల పత్తిపాటి (కవయిత్రి).- చరవాణి 9347042218
కళాకారులను ఆదుకునే వారు లేక
గంగిరెద్దుల ఆటలు హరిదాసు కీర్తనలు
కనుమరుగై పోతున్న తరుణంలో
ఎక్కడుంది మకర సంక్రాంతి పండుగ

ప్రకృతి నేస్తమైన బసవన్న
కనుమరుగై పోతుంటె ఎక్కడుంది
మకర సంక్రాంతి పండుగ

అడిగేవారు లేక అక్కున చేర్చుకునే  వారు లేక
చిరిగిన బట్టలతో ఆకలి మంటలతో బతుకు బండి
లాగుతున్న సగటు మద్య తరగతి కుటుంబాలకు
ఎక్కడుంది మకర సంక్రాంతి పండుగ

సరైన జీతాలు లేక ఎప్పుడు పోతుందో తెలియని
ఉద్యోగాలతో కాలిన కడుపులు బోగి మంటలతో
మండుతుంటే ఎక్కడుంది మకర సంక్రాంతి పండుగ

రావాలి రావాలి ప్రతి రోజు
పండుగ చేసుకునే రోజు రావాలి

కావలి కావాలి ప్రతి రోజు
నిత్య నూతన సంక్రాంతి కావాలి
==============================
మంజుల పత్తిపాటి (కవయిత్రి).- చరవాణి 9347042218.
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాల బాగుంది
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
Very nice