హృదయం హ్యూమన్! -మెదడు కంప్యూటర్!:- డా పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.
1.
గగనాన  ఏమా,
             తాటిపై నడక !

చలనాన ఏమాత్రం ,
               కంగారు పడక!

 పైగా ఓ వింత ,
               కావిడి మోత !

లేదు చేయూత ,
             ఉన్నది ఏకాగ్రత!

 హృదయం, మెదడుల.
      మధ్య సమతుల్యత !

మానవ జీవితాన ,
             అదే ఆవశ్యకత.!
2.
హృదయం దైవ నివాసం! 

మెదడంతా బుద్ధి వికాసం!

 బుద్ధి నేడెంతో  అదురు! 

సమస్యలంటే ఓ బెదురు! 

హృదయమే ఎంతో కుదురు!
3.
కృత్రిమ మేధ,
         ఏలుతోంది వసుధ!

 నేడు మనిషి బతుకు,  
       నిరంతరం కృత్రిమం! 

సహజత్వానికి,
      జీవనం బహుదూరం!

 నేడు మనిషి తీరు,
               చిత్రాతి చిత్రం !

విశ్వమంతా నేడది ,
        విస్తరిస్తున్న సూత్రం!
4.
మనిషి అనుక్షణం ,
       కత్తి మీద సాము!

 అరక్షణం చాలు ,
జారిపోతే చేరు అగాధము !

ఫీట్స్ అప్పుడప్పుడు.
చేస్తూ ఉంటే ప్రమోదము!

 నిత్య కృత్యమైతే ,
 పొంచి ఉండు ప్రమాదము!

5.
మనిషి యంత్రము,
     బతుకు నియంత్రితము! 

ఎంతసేపు పరుగే,
   అలసిపోతే కనుమరుగే! 

భౌతికంగా ,
ప్రపంచ ఐశ్వరరాధిపత్యం! 

మానసికంగా పీడించే,
      అశాంతి దారిద్ర్యము! 

పదిమందిలో ఏకాకి ,
     వెనక ఉండు తుపాకి!
_________


కామెంట్‌లు