\ఓ మా భరతమాత పుత్రులారా
మా ఈ భారతీయ మిత్రులారా
మన భారతదేశం మనందరి కోసం
నేడు అందిస్తుంది ఓ శుభ సందేశం
సత్యమనే ఆయుధాన్ని మీరు పట్టండి
అసత్య ధైత్య శక్తులను అదరగొట్టండి
ఉవ్వెత్తుగ తల ఎత్తుక ఇక నడవండి
ఉర్వియందు విజయ శంఖం ఊదండి !
మీ త్యాగాలను పెట్టుబడిగా పెట్టండి
ప్రజాసేవయే మీ ధ్యేయంగా పెట్టుకోండి
జాతి నాయకుల కలలను పండించండి
జ్ఞ్యాతి కలహాలకు తిలోదకాలు
ఇప్పించండి !
సత్య దీక్ష వ్రతం మీరు చేపట్టి
నిత్య సేవను గుప్పిట్లో బిగబట్టి
మన ఆశయాలను సాధించండి
సమ సమాజాన్ని నిర్మించండి
జలగలా మన జాతిని పట్టి పీడిస్తున్న
కుల మతాల కుళ్ళు వ్యవస్థను కూల్చండి
నిశీద విషాద హృదయాల్లో నుండి శాంతి కాంతి దీపాలను వెలిగించండి!
పూట తిండి కోసం తపించి కృషించే
అన్నార్తుల ఆకలిని మరిపించే మురిపించే
మచ్చలేని మరో లోకాన్ని సృష్టించండి
మన మానవతకు స్థానాన్ని మీరు కల్పించండి!
ఆహారహం మీరంతా పరిశ్రమించండి రండి
అధిక పల సాయం వెంటనే సాధించండి
ఆకలితో మండే ప్రేగుల్లో అమృత ధారలు కురిపించండి
ఆ ఆకలి కాలం అంతమయ్యేలా మీరంతా శ్రమించండి!
మనస్సులోని తమస్సును మాయం చేసి
చదువు సంస్కారాన్ని అందరికీ పంచండి
పరువు ప్రతిష్టను మీరంతా ఇక పెంచండి!
కుతంత్ర మంత్రాల మేడల కూల్చండి
స్వతంత్ర యంత్రాల వాడల తేల్చండి
సహోదరత్వానిక సారథ్యం వహించండి
ఐక్యమత్యమే మన బలం అని కీర్తించండి!
ఎవరికివారు విడిపోతే మీరు
చివరికి ఏపనిని సాధించలేరు
అందుకే అంతా కలిసి ఉందాం
సమైక్యత బలం పుంజుకుందాం !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి