నా ఊరు! నా వారు!: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
మనిషి మనిషిని నమ్మకుండా
మనిషి విలువ తెలియకుండా
విడిగా నీవు ఉండొద్దు సోదరా
విడిగా నీవే తెచ్చుకునే బాధరా !

ఇరుగు పొరుగు కలిసి ఉంటే
వారు బాధ్యత తెలుసుకుంటే
శుభము కలుగును ఓ సోదరా
అశుభము తొలుగును నీకురా !

నీవు ఉండాలి వారందరికీ
నీవు చేరితీరాలి వారి దరికి
అప్పుడే అందరికీ ఆనందం
ఎప్పటికీ విడిపోని అనుబంధం

నీ వారందరికీ కలిమిని ఇక పెంచు
ఊరి వారందరికీ చెలిమిని  పంచు
అందరి మదిలోన నీవిక  జీవించు
వారందరూ నీవారిని ఇక భావించు 

ఊరి వారంతా నీకు తోడవుతారు .
చేరి వారు కొంత నీకు నీడవుతారు
మనోడు వీడని నిన్ను చేరదీస్తారు
మనువాడా రా అని కోరి వస్తారు  


కామెంట్‌లు