సరదా సరదా ఒక పాట
పాడుతానులే ఈ పూట
ఏ పరదా చాటు లేకుండా
మీకందిస్త నా అండదండ !
మీ ముందరనే ఉంటా
సుందర స్వప్నం కంటా
వినుటకు రండి అంతా
చాటండి ఇక ఊరంతా !
పదనిసలతో ప్రాణం పోశా
సరిగమలతో నే రాగం తీశా
కలిగించరులే మీ రవరోధం
కలిగిస్తే నేచేస్తాలే సంవాదం !
నా పాటను వింటేను మీరంతా
మీ మదిలో ఉండదు ఏ చింతా
ఏరి కోరి చెప్తున్నా మీ అందరికీ
మీరంతా రావాలిక ముందరికి !
మీరే నా పాటకు తాళం వేయాలి
పారే సంగీతానికి గొళ్ళెం తీయాలి
సంగీత సామ్రాజ్యాన్ని మీరేలాలి
నా పాటల బండిని మీరే తోలాలి !
ఎలాగ నైనా నాలాగా మీరు
పాడుటకు సాధన చేయండి
సాధన చేస్తే ఇల రానిదంటూ
ఏదీలేదని మీరు తెలుసుకోండి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి