సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి
అంతా బహిరంగ రహస్యమే అన్నట్లుగా కాదు
కొంత గోప్యత పాటించండి.
స్వలాభాల కోసం ఎంతకైనా దిగజారే తత్త్వాన్ని దూరం చేసుకోండి .
సామాజిక మాధ్యమాల్లో అనవసర విషయాలపై
రాద్ధాంతం చేయడం ఇకనైనా ఆపండి.
ఏ న్యూస్ ఛానెల్స్ స్వప్రయోజనాల కోసం
ఈ తలాతోకాలేని చర్చోపచర్చలు
ఉద్వేగాలు రెచ్చగొట్టుకొని ఊరేగడాలు
మనకు ఎలాగూ వాక్ స్వాతంత్రం ఉంది కదా అని
అడ్డు అదుపు లేకుండా నోరుపారేసుకోకండి
నూట నలభై కోట్ల జనాభా కలిగిన
మన దేశంలో ఏ సామాజిక అసమానత
మీకు అపరాధంగా కన్పించంలేదా
మనం తినే తిండి కట్టుకునే బట్ట
వీటిని మరీమరీ రచ్చకులాగుతూ
పైచేయి సాధించాలని చూడకండి
యూజ్ లెస్ కంటెంట్ ను ట్రోల్ చేయు ట్రోలర్స్
వెన్నులో వణుకు పుట్టించేలా
సోషల్ మీడియా సెల్ఫ్ డబ్బా
వక్తలకు తగిన శిక్షా పారితోషికాన్నివ్వండి
విద్యార్థులు చదువుపై
నిరుద్యోగులు ఉద్యోగసాధనపై
గృహిణులు గృహసీమను స్వర్గసీమగా మలచడంపై
కవులు కళాకారులు సామాజిక అసమానతలపై
దృష్టి సారించాలి
సోషల్ మీడియాలో కులం ,మతం రంగు ,రూపు ,వర్గం
వైషమ్యాలు స్త్రీ పురుషుల వస్త్రాధారణపై \
అనవసర చర్చ జరిపినా నిష్కారణంగా
ఆ కంటెంట్ ను తొలగించండి
సోషల్ మీడియా సామాజిక చైతన్యానికి దోహదకారి కావాలి
కానీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి