నేల తల్లిని నేను మిము గన్న నేలతల్లిని..మానవజాతి మనుగడుకు మూల కేంద్రం నేను..జీవమనే దైవం పురుడోసుకున్న క్షేత్రం నేను..కంటికి రెప్పలా కాచుకునే కన్నతల్లి జోలాలి నేను..నా బిడ్డలందరి భారాన్ని,వారి పాప భారాన్ని కూడా ఆనందంగా భరించే బంధం నేను..కాళ్లతో నను తొక్కినా, గునపాలతో నా గుండెల్లో గుచ్చినా,నా తనువును తవ్వి తవ్వి తూట్లు పొడిచినాపంట సిరులు అందించే పాలవెల్లిని నేను..మీరు ఇష్టం వచ్చినట్టు అధికరసాయనాలు,పురుగుమందులు వాడినా జీవసారాన్నంతా నాశనం చేసినా,అడవి అంటూ లేకుండా అడుగు కూడా పచ్చనిప్రకృతికి వదలకుండా ఆకాశాన్నంటే మేడలు, మిద్దెలు కట్టి..నన్నెంత హింసించినా నోరు మెదపని మౌనాన్ని నేను..అప్పుడప్పుడు నా భుజాలపై ఈ లోకపు పాపపు బరువునుమోయలేక క్షణకాలం భుజం మార్చుకుంటానే గాని ప్రళయాలు సృష్టించను..నాలో ఇంకని చెత్తని నాపై వేసినను చిత్రవధ చేసినా చివరికి మిమ్మల్ని నాలోనే ప్రేమగాకలుపుకుంటాను..అమ్మను కదా!కానీ నా బాధంతా ఒక్కటేఈ మీ కాలుష్యపు పనుల వల్ల నా కన్నా మీరు,మీ ముందు తరాల వారు నష్టపోతున్నారని,విషపు ఆహార పదార్థాలు తిని వ్యాధిగ్రస్తులై ప్రాణాలు విడుస్తున్నారనికన్నతల్లిగా ఇది నా వేదన ఈ "నేలతల్లి"ఆవేదన.
ఆవేదన. :- నాగవేణి చాగర్లమూడి-చరవాణి:9908159215
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి