ఆవేదన. :- నాగవేణి చాగర్లమూడి-చరవాణి:9908159215
నేల తల్లిని నేను మిము గన్న నేలతల్లిని.. 
మానవజాతి మనుగడుకు మూల కేంద్రం నేను.. 
జీవమనే దైవం పురుడోసుకున్న క్షేత్రం నేను.
.కంటికి రెప్పలా కాచుకునే కన్నతల్లి జోలాలి నేను.. 
నా బిడ్డలందరి భారాన్ని, 
వారి పాప భారాన్ని కూడా ఆనందంగా భరించే బంధం నేను.. 
కాళ్లతో నను తొక్కినా, గునపాలతో నా గుండెల్లో గుచ్చినా, 
నా తనువును తవ్వి తవ్వి తూట్లు పొడిచినా 
పంట సిరులు అందించే పాలవెల్లిని నేను..

 మీరు ఇష్టం వచ్చినట్టు అధిక 
రసాయనాలు,పురుగుమందులు వాడి 
నా జీవసారాన్నంతా నాశనం చేసినా,
అడవి అంటూ లేకుండా అడుగు కూడా పచ్చని
 ప్రకృతికి వదలకుండా ఆకాశాన్నంటే మేడలు, మిద్దెలు కట్టి.. 
నన్నెంత హింసించినా నోరు మెదపని మౌనాన్ని నేను..
అప్పుడప్పుడు నా భుజాలపై ఈ లోకపు పాపపు బరువును
 మోయలేక క్షణకాలం భుజం మార్చుకుంటానే గాని ప్రళయాలు సృష్టించను..
నాలో ఇంకని చెత్తని నాపై వేసి
నను చిత్రవధ చేసినా చివరికి మిమ్మల్ని నాలోనే ప్రేమగా
కలుపుకుంటాను..అమ్మను కదా!కానీ నా బాధంతా ఒక్కటే
  ఈ మీ కాలుష్యపు పనుల వల్ల  నా కన్నా మీరు
,మీ ముందు తరాల వారు నష్టపోతున్నారని, 
విషపు ఆహార పదార్థాలు తిని వ్యాధిగ్రస్తులై ప్రాణాలు విడుస్తున్నారని
 కన్నతల్లిగా ఇది నా వేదన ఈ "నేలతల్లి"ఆవేదన.


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
బాగుంది
అజ్ఞాత చెప్పారు…
Very nice