దక్కను పీఠభూమిలో ప్రత్యేకమై,
ముచుకుందు మహిమతో మున్ముందుకు ప్రవహిస్తూ,
తాగునీటి నదులలో నిక్షిప్తమై,
నిరంతరం ప్రవహించింది.
రాచఠీవికి దర్పణమై,
చరిత్రను తనలో కలుపుకొని,
చారిత్రకమైనది.
మూసీ పేరుతో మురిపమై
తెలంగాణకు తలమానికమైనది.
వరదలతో ముంచెత్తి ఉగ్రరూపం దాల్చినా,
భాగ్యనగర ప్రణయ సాక్ష్యమైనది.
పెరుగుతున్న నగరానికి పెనుసవాలై నిల్చింది.
కాలక్రమేణా నాగరికతతో
కాలుష్య కాసారమై,
పేదవారికి ఆశ్రయమిచ్చావు.
నేడు అభివృద్ధి కోసమై ఆరాటపడుతూ,
తిరిగి అమృతమయమవుతుందనే
ఆలోచనలో మరో పునరుజ్జీవనానికి సమాయత్తమవుతున్నది.
జీవనదై జీవించు మూసీ!
మమ్ములను చల్లంగ కాచి.
ముచుకుందు మహిమతో మున్ముందుకు ప్రవహిస్తూ,
తాగునీటి నదులలో నిక్షిప్తమై,
నిరంతరం ప్రవహించింది.
రాచఠీవికి దర్పణమై,
చరిత్రను తనలో కలుపుకొని,
చారిత్రకమైనది.
మూసీ పేరుతో మురిపమై
తెలంగాణకు తలమానికమైనది.
వరదలతో ముంచెత్తి ఉగ్రరూపం దాల్చినా,
భాగ్యనగర ప్రణయ సాక్ష్యమైనది.
పెరుగుతున్న నగరానికి పెనుసవాలై నిల్చింది.
కాలక్రమేణా నాగరికతతో
కాలుష్య కాసారమై,
పేదవారికి ఆశ్రయమిచ్చావు.
నేడు అభివృద్ధి కోసమై ఆరాటపడుతూ,
తిరిగి అమృతమయమవుతుందనే
ఆలోచనలో మరో పునరుజ్జీవనానికి సమాయత్తమవుతున్నది.
జీవనదై జీవించు మూసీ!
మమ్ములను చల్లంగ కాచి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి