పుస్తక పఠనం శ్రేష్టము: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
పుస్తకాలు చదవాలి
విజ్ఞానం పొందాలి
మస్తకాల్లో బూజును
తక్షణమే దులపాలి

కన్నవారిని చూడాలి
కన్నీళ్లను తుడవాలి
కష్టాల వేళల్లో
మనోధైర్యం చూపాలి

గురువులను సేవించాలి
స్ఫూర్తిగా నిలబడాలి
మహాత్ముల జాడల్లో
అనునిత్యం నడవాలి

అహంకారం వదలాలి
వినయశీలురు కావాలి
అక్షర జ్యోతులు వెలిగించి
అజ్ఞానం తరమాలి


కామెంట్‌లు