కోపాన్ని నియంత్రించు!!:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
చెరుపు చేయు కోపము
పాడగును ఆరోగ్యము
అదుపు చేస్తే మేలు
దొరుకుతుంది శాంతము

కోపంతో నష్టము
బంధాలకు విఘాతము
ఆదిలో త్రుంచితే
క్షేమమే అపారము

అన్నీ వ్యాధులకది
అవుతుంది కారణము
కల్లోలమగును మది
జాగ్రత్త అవసరము

చేయాలి నియంత్రణ
అది బ్రతుకులో రక్షణ
అధికమైన కోపము
అనర్ధాలకు మూలము


కామెంట్‌లు