పోసిన పోలయ్య కూకట్లపల్లికి సత్కారం
 మహర్షి వాల్మీకి సంస్థ ఆధ్వర్యంలోగౌరవాధ్యక్షులు పూర్వ మైన్స్ డైరెక్టర్ డాక్టర్ వి.డి రాజగోపాల్ అధ్యక్షతన వారు రచించిన, పల్లోలి శేఖర్ బాబు సంభాషణలు సమకూర్చి దర్శకత్వం వహించిన, ఎర్ర సింధూరం ఏడబాయతల్లి నాటకం జనవరి 1 వ తేదీన శ్రీ త్యాగరాజ గాన సభలో దిగ్విజయంగా ప్రదర్శింపడిన సందర్భంగా...ఆదివారం (18.01.2026) అల్లాయిడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో అభినందన సభ జరిగింది.కవి గాయకులు రవీంద్రబాబు అరవాకవి సమ్మేళనం చక్కగా నిర్వహించారు...ఈ సందర్భంగా దర్శకులు పల్లోలి శేఖర్ బాబును, చెన్నమ్మ పాత్రధారి ప్రియాంకను స్వరసమ్రాట్ శరత్ చంద్రను వారి కళను ప్రతిభను శ్లాఘిస్తూ డా.వి.డి రాజగోపాల్ ఘనంగా సన్మానించారుఈ సభకు డా. మహమ్మద్ రఫీ జర్నలిస్టు, రామకృష్ణ చంద్రమౌళి, సాధనాల వెంకటస్వామి నాయుడు, ఆశాలత, రామలక్ష్మి, డా.శాంతిశ్రీ, యం.కె.గాంధీ, కె.వి.యస్.రెడ్డి, డా. వందనం హాజరై..నటీ నటులందరూ అద్భుతంగా నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారంటూ అభినందిస్తూ నాటకాన్ని అద్భుతంగా సమీక్షిస్తూ మెరుగులు దిద్దుకునేందుకు చక్కని సూచనలు చేసి ఈ నాటకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రదర్శించాలన్నారుఈనాటకంలో పాపారాయుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న పోలయ్య కవి కూకట్లపల్లి నాటకాన్ని సమీక్షిస్తూ నాటకంలో ప్రేక్షకులు ఊహించని కొన్ని ట్విస్ట్ లుండాలన్నారు.
"ఎవడ్రా వీడు పానకంలో పుడక.
"వాడు పెద్దోడు పానకంలో
"పుడక కాదు పక్కలో బల్లెం...
"మద్దిలేటి కొడుకా మజాకా....
"ముఠా కక్షలకు ముద్దుబిడ్డ...
"కొలిమి గుండ్ల కోడెనాగు...
"ఖర్చు నాది...కుర్చీనీది...
"భయపడకు బీసీ బిడ్డా...
"ఇది పాపారాయుడు అడ్డా...
ఇక నుండి...
"నరుక్కోవడాలుండవు నవ్వుకోవడాలే
"కత్తిపోట్లుండవు కౌగిలించుకోవడాలే...
"చాలు చాలు ఇక నుండి
"ఈ కుట్రలకు ఈ కుతంత్రాలకు...
"ఈ ముఠా కక్షలకు...
"ఈ రాక్షస రాజకీయాలకు...
"ఈ రక్తసింధూరానికి
"ముగింపు పలుకుదాం...అంటూ
కొన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ వినిపించి
అందరినీ అలరించారు ఆకట్టుకున్నారు
మధ్యలో సమీక్షకులను, నటీనటులను,
కవితాగానం చేసిన వారిని, చివరలో 
పాపారాయున్ని డా వి.డి రాజగోపాల్ 
ఆత్మీయంగా సత్కరించారు.రుచికరమైన 
విందుతో సభ దిగ్విజయంగా ముగిసింది.


కామెంట్‌లు