గుంట నక్కను చూశారా
బిక్కమోము పెట్టుకొని
ఒంటరిగానే కూర్చుంది
నలు దిక్కులు చూస్తుంది
గడ్డి తుప్పలలో ఉంటుంది
గుంట గుహల్లో ఉంటుంది
అందుకే గుంట నక్కంటారు
వేట చేయుటకది చూస్తుంది
కుందేల్ల వెంట ఊరుకుతూ
పరుగు పందెము తీస్తుంది
బీర బీర దాన్ని పడుతుంది
కరకర మని కొరికి తింటుంది
జిత్తుల మారిది ఆ నక్క
తెలియనట్టు ఉంటుంది
ఎత్తులు ఎన్నో వేస్తుంది
అడవిలో తిరుగుతుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి