బిజినెస్ మాన్ ను చూసి నేర్చుకో
చల్లగా ఎలా మాట్లాడాలో
చల్లగా ఎలా ఉండాలో.....!?
బిజినెస్ మాన్ ను చూసి నేర్చుకో
ముఖంపై చిరునవ్వు ఎలా ఉండాలో
కోపం ఎలా తగ్గించుకోవాలో......!?
బిజినెస్ మాన్ ను చూసి నేర్చుకో
ఆతిథ్యం ఎలా ఉండాలో
ఆహ్వానం ఎలా ఉండాలో.........!?
బిజినెస్ మ్యాన్ ను చూసి నేర్చుకో
ఓపికగా ఎలా వినాలో
సహనంతో ఎలా భరించాలో........!?
బిజినెస్ మ్యాన్ ను చూసి నేర్చుకో
పని ఎలా పూర్తి చేయాలో
పని ఎలా చేయించుకోవాలో.........!?
బిజినెస్ మ్యాన్ ను చూసి నేర్చుకో
ఖర్చు ఎలా తగ్గించుకోవాలో
ఖర్చు ఎలా చేయాలో..................!?
బిజినెస్ మ్యాన్ ను చూసి నేర్చుకో
అందర్నీ ఎలా ఆకర్షించాలో
అందర్నీ ఎలా మెప్పించి ఒప్పించాలో....!?
బిజినెస్ మాన్ ను చూసి నేర్చుకో
ప్రచారం ఎలా చేయాలో
పరిచయాలు ఎలా పెంచుకోవాలో......!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి