గగన వీధిలో రంగులు
నింపుతూ రేపుతూ
హరివిల్లుపై ఆమని
హాయిగా వస్తున్నట్టు...
వస్తున్న అతిథి కోసం
ముస్తాబు చేసుకుని
తెస్తున్న తాయిలాల కోసం
ఎదురుచూస్తున్నట్టు...
రాబోవు ఏలికకు
విడిది కావాలని అవనిలో
ఆణువణువూ ఆత్రంగా
ఆరాటపడుతున్నట్టు...
ఆలస్యం ఇక ఏ మాత్రం
భరించలేక దారివెంట
చూపులు పరచి
చేతులు జోడించి నిలిచినట్టు..
నిన్నటి కన్నా మెరుగైన
రేపటి కోసం కన్న కలలు
నిజాలై ముంగిట నిలిచి
చేతులు చాచి పిలుస్తున్నట్టు...
నమ్మకాన్ని సడలించక
కమ్మని గమ్యం వైపు
రమ్మని ఆత్మీయంగా
అమ్మలా నడిపించే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి