దోమ : - అచ్యుతుని రాజ్యశ్రీ

 పాడుతా ఘాటుగా మారుతా చెవిపోటుగా 
హాయిగా నిద్రపోతావా బుద్ధిలేని మానవా!
డెంగ్యూ చికెన్ గున్యా వస్తే తిడతావా!? 
మాపని చేస్తూ పొట్ట నింపుకునే కష్టజీవులం 
సోంబేరులకి బుద్ధిచెప్ప వచ్చినాం 
నీవు పోతేమాత్రమేమి? నూటనలభై కోట్ల జనాభా
మాకులేదు చావు,చిరంజీవులం
గెటౌట్ కి టపటపా రాలుతాం 
రావణుని తలల్లా బతికి ఎగురుతాం
నిన్ను కుట్టి కుట్టి జలగలే నయమనిపిస్తం
కొత్త సంవత్సరం అని మానం
కొత్త పథకాలతో మీరక్తం పీల్చి 
అవినీతి అక్రమార్కుల కి దిశానిర్దేశం చేస్తాం😃
కామెంట్‌లు