బెర్హంపూర్ ఆనాటిమద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది.నియోగి బ్రాహ్మణ వంశం తెలుగు జాతీయ వాదులకుటుంబంలో పుట్టారు వరాహగిరి వెంకట గిరి.ఆయన తాత రామయ్య పంతులు ఆంగ్ల విద్య అభ్యసించటం ఆరోజుల్లో విశేషం.గిరి అమ్మ నాన్నలు సుభద్రమ్మ జోగయ్య పంతులు.తండ్రి గొప్ప వకీలు.12మంది సంతానంలో మన గిరి 2వవారు.కానీ 7మంది పిల్లలు చనిపోయారు .గిరి 13వ ఏట అన్న కూడా చనిపోటంతో బాధ్యత ఈయన మీదే పడింది.మేనమామలు విశ్వనాథ రావు,హనుమంతరావులప్రభావంకూడా ఆయనపై పడింది.12ఏళ్ల పిల్లవాడు పుస్తకాల పురుగుగామారి ఇంటింటికీ తిరిగి 200పుస్తకాలు సేకరించి లైబ్రరీ ఏర్పాటు చేశాడు.అలాగే పిడికెడు బియ్యం, డబ్బు విరాళంతో ఆకలితో నకనకలాడేవారికి స్వయంగా 14ఏళ్ల గిరి వంటచేసి వడ్డించేవాడు. 1913లో ఐర్లాండ్ లో బి.ఎ.తో పాటు న్యాయ విద్య పూర్తిచేశారు.రాగానే సరస్వతితో పెళ్లయింది.ఐర్లాండ్ లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో పరిచయం,అనార్కికల్ సొసైటీస్థాపన, ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ నెలకొల్పారు. 1914_15లో లండన్ లో గాంధీజీని కలిశారు. ఐర్లాండ్ లో బ్రిటిష్ కి వ్యతిరేకి అని గిరిని అరెస్ట్ చేశారు.దేశం విడిచిపొమ్మన్నారు. అలా 1916 లో భారత్ కి వచ్చేశారు.మద్రాస్ లో జస్టిస్ ఎలింగ్ జిల్లా మున్సబుగా ఉద్యోగం ఇస్తానంటే"నాదేశం స్వతంత్రం అయ్యేదాకా నేను ఏప్రభుత్వపదవి చేపట్టను" అని ఖచ్చితంగా తోసిరాజన్నాడు.
24ఆగస్ట్1974లో ఆయన పదవీవిరమణ చేసిన రోజే భారత పోస్టల్ శాఖ ఓకొత్త స్టాంపుని విడుదల చేసి సన్మానించింది.1980లో చనిపోయారు" నా దహనసంస్కారాలకి డబ్బు ఖర్చు పెట్టకుండా బీదలకు అన్నదానం చేయండి" అన్న శ్రామిక పక్షపాతిగా చరిత్ర లో నిల్చారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి