మొలక బాలల మాసపత్రిక ఆవిష్కరణ

 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డిడిఎస్) ఆధ్వర్యంలో 26వ పాత పంటల జాతర–సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బాలల మాసపత్రిక మొలక డిడిఎస్ వేదిక మీదుగా ఆవిష్కరించారు.
ఈ వేడుకలో తాండూరు ప్రాంతానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు జనార్ధన్, గాజుల బసవరాజ్, కవయిత్రి, మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షుడు కేవీఎం వెంకట్, పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ సింగ్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదు నాయక్, సీఐ శివలింగం, ఎస్ఐ కాశీనాథ్, రాజేంద్రప్రసాద్, డిడిఎస్ డైరెక్టర్ రుక్మిణి రావు, డాక్టర్ దివ్య, డిడిఎస్ మహిళా సభ్యులు చంద్రబాబు, పూలమ్మ, లక్ష్మమ్మ తదితరులు కలిసి మొలక బాలల మాసపత్రికను ఆవిష్కరించారు.
అదేవిధంగా పదో తరగతి విద్యార్థిని వైష్ణవి, డిడిఎస్ విత్తన సంరక్షకురాలు చంద్రవ్వతో చేసిన ఇంటర్వ్యూతో రూపొందించిన పుస్తకాన్ని మొలక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైష్ణవిని ఘనంగా సన్మానించారు.
భూమిని భూసారంగా కాపాడుతూ, పాత పంటల విత్తనాలు, చిరుధాన్యాలను పరిరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న డిడిఎస్ మహిళల సేవలను వక్తలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ వీరి నుంచి ప్రేరణ పొందుతూ భవిష్యత్తులో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచించారు.
కామెంట్‌లు