జాకీర్ హుసేన్ కుటుంబ నేపథ్యం తెల్సుకుందాం.18వ శతాబ్దిలో ఆఫ్ఘన్ పఠాన్ కుటుంబాలు యు.పి.లోని కాయంగంజ్ ప్రాంతంలో స్థిరపడ్డాయి.కొందరు పొలంపనుల్లో కొంత మంది సైన్యంలో స్థిరపడ్డారు.అలా గులాంహుసేన్ ఖాన్ సైన్యంలో పనిచేశాడు.అతని కొడుకు ఫిదాహుసేన్1888లో హైదరాబాద్ లో వకీలుగా ప్రసిద్ధుడైనాడు.ఆయన భార్య నాజనీన్బేగం కి 6కొడుకులు పుట్టారు.8ఫిబ్రవరి1897లో 3వకొడుకు జాకిర్ హుసేన్ ఖాన్ పుట్టాడు.ఈపిల్లాడి 9వ,ఏట తండ్రికి టి.బి. రావటంతో బిచాణా ఎత్తేసి కాయంగంజ్ వెళ్లింది కుటుంబం.38ఏళ్లకే తండ్రి పోవటం,ప్లేగు వ్యాధికి తల్లి తమ్ముడు చనిపోటం ఆటైంలో జాకిర్ పరీక్ష రాయడానికి వెళ్లడం తో ఆయన మనసు బాధ వ్యథ మాటల్లో చెప్పలేం.ఆయన పరీక్ష రాసి ఇంటికొచ్చాక ఇంట్లో తల్లితో సహా మహిళలంతా ప్లేగుకి బలైనారని తెలిసింది.రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి నడుచుకుంటూ ఆబాలుడు వచ్చి బావురు మన్నాడు. కానీ తల్లి ఎప్పుడూ చెప్పేది" మన పూర్వీకుల వంశగౌరవం నిలబెట్టాలి.బాగా చదవాలి". ఆపిల్లాడు బాధను దిగమింగి చదువులో మునిగాడు.ఇంటర్ లోనే షాహ్ జహా బేగంతో పెళ్లి(పుతలీబాయి అని ముద్దుపేరు) ఐంది.అందాల సుగుణాలరాశి ఆమెకు సయీదా, సాఫియా అనే కుమార్తెలు పుట్టారు.
ఇక జాకీర్ తన 9వ ఏటనే ఇంటిదగ్గరే మౌల్వీసాబ్ దగ్గర ఫారసీ, ఉర్దూ,అరబిక్,ఆంగ్లం కురాన్ లో దిట్ట ఐనాడు.ఇటావా లోని ఇస్లామియా హైస్కూల్లో 5వక్లాస్లో చేరి హాస్టల్ లో ఉన్నాడు.అక్కడ సంస్కృతభాష నేర్చాడు.రోజూ నమాజు చదవకపోతే హాస్టల్ లో అన్నం పెట్టేవారుకాదు.రోజూ జాకీర్ చదివేవాడు.కానీ అలా తిండి పెట్టకుండా మాడ్చటం తప్పని హడ్తాల్ చేసి సాధించిన జాకిర్ ఓహీరోగా అందరిమన్ననలందాడు. రోజూ నడుచుకుంటూ ఇటావా రైల్వేస్టేషన్ కెళ్లి పేపర్లు తెచ్చి హాస్టల్ పిల్లల చేత చదివించి చర్చించేవాడు. బి.ఎ.లో మంచిమార్కులుపొంది*ఇక్బాల్ పతకం* పొందాడు.ఎం.ఏ.ఎల్.ఎల్.బి.చదివిన ఆయన అనువాదాలు,వ్యాసాలు, ఉపాన్యాసాలతో ప్రసిద్ధుడైనాడు.1948లో మౌలానా అబుల్ కలాంఆజాద్ ఆయన్ని అలిగడ్ ముస్లిం యూనివర్శిటీ కులపతిగా నియమించాడు.ఆపై రాష్ట్రపతిగా వాసికెక్కిన ఆయన 3మే 1969లో మరణించారు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి